అందం కోసం మీరు చేయించుకున్న సర్జరీల మాటేమిటి.. నటిని ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు..

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌(Jacqueline Fernandez) ట్రోలింగ్‌కు గురవుతోంది. గతంలో ప్లాస్టిక్‌ సర్జరీలపై ఆమె చెప్పిన అభిప్రాయాలను నెట్టిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. 

Published : 09 Dec 2022 01:33 IST

హైదరాబాద్‌: హిందీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపుపొందిన నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez)‌. తాజాగా ఈ నటి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ప్లాస్టిక్‌ సర్జరీలపై గతంలో ఆమె తన అభిప్రాయాన్ని చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. దీంతో ఆ మాటలను లక్ష్యంగా చేసుకొని కొందరు ఈ నటిని ట్రోల్‌ చేస్తున్నారు. 2006 శ్రీలంక మిస్‌ యూనివర్స్‌(Miss Sri Lanka universe) కిరీటాన్ని జాక్వెలిన్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆ స్టేజిపై ప్రశ్నోత్తరాల సెక్షన్‌లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్‌ సర్జరీలపై తన అభిప్రాయాన్ని చెప్పింది జాక్వెలిన్‌.

‘ప్లాస్టిక్‌ సర్జరీ అనేది మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. అయిన అది చాలా నొప్పితో కూడుకున్నది. అలా సర్జరీలు చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు. అలాంటి వాటిని ప్రొత్సహించకూడదు. నేను దానికి పూర్తిగా వ్యతిరేకిని’ అని జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చెప్పింది. సోషల్‌మీడియా వేదికగా ఈ వీడియోపై ఇప్పుడు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారని’ ఓ నెటిజన్‌ అడగ్గా. ‘తెరపై అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్రచికిత్స మాటేమిటి’ అని మరొకరు ప్రశ్నించారు. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు తాజాగా సర్కస్‌(Cirkus) ట్రైలర్‌ ప్రీమియర్‌లో మెరిసింది. ఇటీవల  అక్షయ్‌కుమార్‌(Akshay Kumar) ప్రధానపాత్రలో నటించిన రామ్‌ సేతు సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని