Kajal: మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ కథానాయికగా  వెలుగొందుతున్న కాజల్‌ అగర్వాల్‌ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోదరి నిషా అగర్వాల్‌ ధ్రువీకరించింది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో

Updated : 20 Apr 2022 14:08 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ కథానాయికగా  వెలుగొందుతున్న కాజల్‌ అగర్వాల్‌ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోదరి నిషా అగర్వాల్‌ ధ్రువీకరించింది. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్‌-గౌతమ్‌ కిచ్లూ జంటకి అభినందనలు పోటెత్తుతున్నాయి. కాజల్‌ తను గర్భం దాల్చినప్పుడు తల్లిని కాబోతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో సంతోషంగా వివరాలు పంచుకుంది. మెటర్నిటీ, బేబీ బంప్‌ ఫొటోషూట్‌లు చేసింది. మాతృత్వపు మధురిమలు తననెంతో ఉత్సుకతకు గురి చేస్తున్నాయంటూ ఆ ఊహల్ని తలచుకుంటూ ‘ప్రత్యేకమైన నోట్‌’ రాసి అందరితో పంచుకుంది. ఎట్టకేలకు తను కోరుకున్న రోజు రానే వచ్చింది. కాజల్‌  మెగాస్టార్‌  చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య ఈనెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని