Updated : 10 Feb 2022 07:09 IST

Kajal: దయతో మెలగడం నేర్చుకుందాం

ర్భంతో ఉన్న కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం తాను అత్యంత అద్భుతమైన... సరికొత్త  పరిణామాల మధ్య జీవితాన్ని గడుపుతున్నట్టు తెలిపారు. శిశువుకి జన్మనిచ్చే ప్రక్రియ, ఒక అనుభవంతో కూడిన విశేషమైన వేడుక అంటూ తన భావాల్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. గర్భం వల్ల శారీరకంగా తనలో వచ్చిన మార్పుల్ని ఎత్తిచూపుతూ, సామాజిక మాధ్యమాల్లో   అవమానకరంగా వ్యాఖ్యలు చేసినవాళ్లపై కూడా ఆమె మండిపడ్డారు. దయతో మెలగడం నేర్చుకుందామని, అలా ఉండటం కష్టం అనుకుంటే... బతుకుతూ ఇంకొకరిని బతకనివ్వండంటూ వ్యాఖ్య చేశారు. కాజల్‌... వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల కిందటే గర్భం దాల్చిన ఆమె    తొలి బిడ్డకి జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఆమె సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోల్ని పంచుకున్నారు. వాటిపై కొద్దిమంది నెటిజన్లు చేసిన వ్యాఖ్యలు, మీమ్‌లపై కాజల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని ఫొటోల్ని పంచుకోవడంతోపాటు తనలా గర్భం దాల్చిన మహిళలకి కొన్ని సూచనలు ఇస్తూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. ‘‘గర్భధారణ సమయంలో శరీరం బరువు పెరగడంతోపాటు అనేక మార్పులకి గురవుతుంది. ప్రసవం తర్వాత మనుపటి స్థితికి రావడానికి కొంత సమయం పట్టవచ్చు, లేదా గర్భం దాల్చడానికి ముందున్న స్థితికి
రాకపోవచ్చు. ఈ మార్పులు సహజమైనవి. జీవితంలోని అత్యంత అందమైన, అద్భుతమైన విలువైన దశలో ఉన్నప్పుడు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేద’’ంటూ ఆమె తోటి మహిళలకి పలు సూచనలు చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని