Karate Kalyani: నటి కరాటే కళ్యాణికి ‘మా’ ఝలక్‌.. సభ్యత్వం రద్దు

Karate Kalyani: నటి కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సస్పెండ్‌ చేసింది. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 25 May 2023 19:48 IST

హైదరాబాద్‌: సినీనటి కరాటే కళ్యాణి(Karate Kalyani:)ని తెలుగు సినీ నటీనటుల సంఘం (MAA) నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు తమ సంఘం నుంచి కళ్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్‌ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. మా నోటీసుపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. కళ్యాణి వివరణపై ‘మా ’కార్యవర్గం  సంతృప్తి చెందలేదు. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో ‘మా’నిబంధనల ప్రకారం కరాటే కళ్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే: నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. మే 28 న ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ‘ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? ఎవరిని మెప్పించడానికి ఇదంతా చేస్తున్నారు’ అంటూ ప్రశ్నించారు. తెలుగు సినిమాకు ధ్రువతారలాంటి ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది.  మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని