Kasturi: ‘రాముడు కాదు కర్ణుడిలా కనిపిస్తున్నారు’: ‘ఆదిపురుష్’ పోస్టర్‌పై కస్తూరి విమర్శలు
‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా పోస్టర్‌పై నటి కస్తూరి (Kasturi) విమర్శలు కురిపించారు. ప్రభాస్, ఇతర నటీనటుల లుక్స్‌ను ఆమె తప్పుబట్టారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆదిపురుష్’ (Adipurush) సరికొత్త పోస్టర్‌పై నటి కస్తూరి (Kasturi) విమర్శల వర్షం కురిపించారు. ప్రభాస్ (Prabhas) లుక్ చూస్తుంటే కర్ణుడు గుర్తుకువస్తున్నారని ఆమె అన్నారు. శ్రీరాముడు, ఆయన సోదరుడు లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘రామలక్ష్మణులను మీసాలు, గడ్డంతో చూపించిన సంప్రదాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి కలవరపెట్టే మార్పులను ఎందుకు చూపించారు. మరీ ముఖ్యంగా, (ప్రభాస్‌ను ఉద్దేశిస్తూ) తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది లెజెండ్స్ శ్రీరాముడి పాత్రను పూర్తిస్థాయి పరిపూర్ణతతో తెరపై చూపించారు. కానీ, ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కాకుండా కర్ణుడిగా కనిపిస్తున్నారు’’ అని ఆమె విమర్శించారు. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడుతుంటే.. మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మీసాలు, గడ్డంతో రాముడిని చూడటంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓం రౌత్ ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ సిద్ధం చేశారు. రాముడిగా ప్రభాస్.. జానకిగా కృతిసనన్ నటించారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 16న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ‘ఆదిపురుష్’ సరికొత్త పోస్టర్లను ఒక్కొక్కటిగా సినీ ప్రియులతో పంచుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..
-
Tamil Nadu : తమిళనాడులో అవయవదాత మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-
sitamma vakitlo sirimalle chettu: పెద్దోడి పాత్రలో పవన్‌కల్యాణ్..