Krithi Shetty: ఆ దర్శకుడితో మాట్లాడుతూ ఏడ్చేశా: కృతిశెట్టి

‘ఉప్పెన’తో నటిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే విశేష క్రేజ్‌ సంపాదించుకున్న నటి కృతిశెట్టి. తనకు బాగా దగ్గరైన ఓ పాత్ర గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

Updated : 12 May 2023 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటులెవరికైనా తాము పోషించిన పాత్రల్లో కొన్ని మనసుకు బాగా దగ్గరవుతాయి. ఒక్కోసారి అవి భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. ‘బంగార్రాజు’ (Bangarraju) సినిమాలోని నాగలక్ష్మి పాత్ర తనకు ఇలాంటి అనుభూతినే పంచిందన్నారు హీరోయిన్‌ కృతిశెట్టి (Krithi Shetty). చిత్రీకరణ పూర్తైన తర్వాత ఆ సినిమాని చూసి, వెంటనే దర్శకుడు కల్యాణ్‌ కృష్ణకు ఫోన్‌ చేశానని, ఆయనతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఏడ్చానని చెప్పారు. తన తాజా చిత్రం ‘కస్టడీ’ (Custody) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నాగలక్ష్మి క్యారెక్టర్‌ని కృతిశెట్టి గుర్తుచేసుకున్నారు. పూర్వీకులు రక్షణగా ఉంటారనే దాన్ని తాను నమ్ముతానని, సంబంధిత సన్నివేశాలు ‘బంగార్రాజు’లో ఉండడం వల్ల కనెక్ట్‌ అయ్యాయని వివరించారు. ఫెయిల్యూర్‌పై స్పందిస్తూ.. ప్రతి సినిమాకీ ఒకే విధంగా కష్టపడతానన్న ఆమె విజయం అనేది తన చేతుల్లో ఉండదన్నారు. నటి అనుష్కశెట్టిని కలవాలనుందనే మనసులో మాట బయటపెట్టారు. రాజకుమారి తరహా పాత్రల చేయాలనేది తన డ్రీమ్‌ అన్నారు.

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), ఆయన తనయుడు నాగచైతన్య (Naga Chaitanya) కలిసి నటించిన చిత్రమే ‘బంగార్రాజు’. అందులో చైత్యకు జోడీగా కృతి కనిపించారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ హిట్‌ సినిమా తర్వాత చైతన్య, కృతి కలిసి ‘కస్టడీ’లో నటించారు. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో కానిస్టేబుల్‌ శివగా చైతన్య, రేవతిగా కృతి కనిపించారు. అరవిందస్వామి, శరత్‌కుమార్‌, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని