Malavika: ఆ రేప్‌ సీన్‌ తప్ప అంతా ‘చాలా బాగుంది..!’: మాళవిక

తాను నటించిన తొలి తెలుగు చిత్రం లోని రేప్‌ సన్నివేశం ఇబ్బంది పెట్టిందని, అది మినహా ఆ సినిమాకు పనిచేయటం మంచి అనుభూతినిచ్చందని మాళవిక అన్నారు.

Published : 02 Feb 2022 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను నటించిన తొలి తెలుగు చిత్రంలోని రేప్‌ సన్నివేశం మినహా ఆ సినిమాకు పనిచేయటం మంచి అనుభూతినిచ్చిందని మాళవిక అన్నారు. ‘చాలా బాగుంది..!’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘దీవించండి’, ‘శుభకార్యం’, ‘అప్పారావు డ్రైవింగ్‌ స్కూల్‌’ తదితర సినిమాలతో అలరించారు. తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘకాలం దూరంగా ఉన్న ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమం వేదికగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. ‘సీయు ఎట్‌ 9’ అనే హిందీ సినిమాలో ఎక్స్‌పోజ్‌ చేసినందుకు కుటుంబ సభ్యులు తనపై కోప్పడ్డారని, అలా నటించినందుకు తర్వాత బాధపడ్డానని తెలిపారు. 5 తెలుగు చిత్రాలు, 35 తమిళ సినిమాల్లో నటించానని చెప్పారు. బన్‌, సమోస తినేందుకు క్లాస్‌ బంక్‌ కొట్టి క్యాంటీన్‌లోనే ఎక్కువగా ఉండేదాన్నంటూ నవ్వులు కురిపించారు. ఒకప్పుడు టాలీవుడ్‌ హీరో నాగార్జున అంటే ఇష్టమని, ఇప్పుడు విజయ్‌ దేవరకొండని తన మనసులో మాట బయటపెట్టారు. నటులు రజనీకాంత్‌, శ్రీకాంత్‌, రాజేంద్ర ప్రసాద్‌తో నటించేటప్పుడు తానెలా ఫీల్‌ అయ్యారో వివరించారు. ఇటీవల.. ‘పుష్ప’ సినిమాని చూశానని, అందులోని ‘ఊ అంటావా’ గీతానికి అవకాశం వస్తే తప్పకుండా ఓకే చెప్పేదాన్నని అన్నారు.

‘ఉన్నై థేడి’ (తమిళం)తో తెరంగేట్రం చేసిన మాళవిక అసలు పేరు శ్వేతా కొన్నూర్‌ మేనన్‌. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటించిన మాళవిక.. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చాలా బాగుంది..!’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. తన అందం, అభినయంతో తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని