Ponniyin Selvan: ఐశ్వర్య రాయ్‌ని చూస్తే అసూయగా ఉంది..: మీనా

తెలుగు చిత్రసీమలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు నటి మీనా. తన 6 ఏళ్ల వయసులో సినీ రంగప్రవేశం చేసి అనేక మంది ప్రముఖ నటులతో సుమారు 90 చిత్రాల్లో నటించారు.

Updated : 02 Oct 2022 14:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బాలనటిగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు నటి మీనా. 6 ఏళ్ల వయసులో సినీ రంగప్రవేశం చేసి అనేక మంది ప్రముఖ నటులతో సుమారు 90 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించారు. తాజాగా మీనా చేసిన ఓ సరదా ట్వీట్‌ అందరినీ ఆకర్షిస్తోంది. పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ పాత్రను ఉద్దేశించి ఆమె ట్వీట్‌ చేశారు.‘‘నా డ్రీమ్‌ క్యారెక్టర్‌ నందిని(పొన్నియిన్‌ సెల్వన్‌లో ఐశ్వర్య రాయ్‌ పాత్ర) పాత్ర పోషించిన ఐశ్వర్య రాయ్‌ని చూస్తే అసూయగా ఉంది. నా జీవితంలో మొదటిసారి నేను అసూయపడుతున్నాను. పొన్నియిన్‌ సెల్వన్‌లో నటించిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు.

ఇక విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి భారీ తారాగణంతో మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రం సెప్టెంబర్‌ 30న విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని