Mouni Roy: మౌనీరాయ్‌ పెళ్లి సందడి

వెండితెర, బుల్లితెరపై అలరిస్తున్న కథానాయిక మౌనీరాయ్‌ వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. దుబాయ్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సూరజ్‌ నంబియార్‌తో ఆమె వివాహం గురువారం గోవాలో

Updated : 28 Jan 2022 06:53 IST

వెండితెర, బుల్లితెరపై అలరిస్తున్న కథానాయిక మౌనీరాయ్‌ వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. దుబాయ్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సూరజ్‌ నంబియార్‌తో ఆమె వివాహం గురువారం గోవాలో జరిగింది. ఈ విషయాన్ని మౌనీ ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. ‘‘నాకు ప్రియుడు దొరికాడు. కుటుంబ సభ్యుల, స్నేహితుల ఆశీస్సులతో మాకు పెళ్లయ్యింది. మీ అందరి ఆశీర్వచనాలు కావాలి’’అని రాసింది మౌని. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పలువురు తారలు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు