డ్రగ్స్‌ సేవిస్తూ పట్టుబడ్డ టాలీవుడ్‌ హీరోయిన్‌

‘బుర్రకథ’ ఫేమ్‌ నైరాషా డ్రగ్స్‌ కేసులో అరెస్టయింది. ఆమెను ఎన్‌.సి.బి(నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు ముంబయిలో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నైరా జన్మదినం సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ ఆషిక్‌ సాజిద్‌ హస్సేన్‌తో కలిసి జుహులోని ఒక హోటల్‌ గదిలో పార్టీ చేసుకుంది.

Published : 15 Jun 2021 20:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బుర్రకథ’ ఫేమ్‌ నైరాషా డ్రగ్స్‌ కేసులో అరెస్టయింది. ఆమెను ఎన్‌.సి.బి(నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో) అధికారులు ముంబయిలో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నైరా జన్మదినం సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ ఆషిక్‌ సాజిద్‌ హస్సేన్‌తో కలిసి జుహులోని ఒక హోటల్‌ గదిలో పార్టీ చేసుకుంది. సదరు హోటల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయన్న సమాచారంతో అదేరోజు తెల్లవారుజామున 3గంటలకు ఎన్‌.సి.బి అక్కడ తనిఖీలు చేసింది. ఈక్రమంలోనే నైరాతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ సిగరెట్లలో గంజాయి పీలుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. కాగా.. ఇద్దరూ నిషేధిత మాదకద్రవ్యాలు సేవించినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts