Pooja Hegde: ఫుల్‌ క్లాసీగా పూజా హెగ్డే నివాసం.. హోమ్‌ టూర్‌ షేర్‌ చేసిన నటి

హోమ్‌ టూర్‌ వీడియోని షేర్‌ చేశారు నటి పూజాహెగ్డే. అభిరుచులకు అనుగుణంగా సిద్ధం చేసుకున్న ఈ ఇల్లు అంటే తనకెంతో ఇష్టమని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Updated : 17 Nov 2022 13:48 IST

ముంబయి: దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే (Pooja Hegde). సినిమా షూటింగ్స్‌ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఈ భామ గతేడాది ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తన అభిరుచులకు అనుగుణంగా సిద్ధం చేసుకున్న ఈ ఇంటిని తాజాగా అందరికీ పరిచయం చేస్తూ.. హోమ్‌ టూర్‌ వీడియో షేర్‌ చేశారు. ఇంటిలోని రంగులు, వాల్‌ డిజైన్స్‌, లివింగ్‌ ఏరియా, కిచెన్‌, బెడ్‌ రూమ్‌ ఇలా ప్రతిదీ ఫుల్‌ క్లాసీ లుక్‌లో ఉండేలా పూజా డిజైన్‌ చేయించుకున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.

‘‘జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఇప్పటివరకూ జీవిత ప్రయాణంలో నా గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఈ ఇంటిని నిర్మించేటప్పుడు నేను ఎలాంటి వ్యక్తిని? నాకు ఎలాంటి ఇష్టాయిష్టాలున్నాయి? అనేది తెలిసింది. నేనొక క్లిష్టమైన టాస్క్‌ మాస్టార్. కార్మికులు ఎంతో శ్రద్ధ, ప్రేమతో ఈ ఇంటిని నిర్మించారు. సినిమాల్లో పనిచేయడం వల్ల ప్రతి దానికి కథ ఉండేలా చూస్తాం. అలా నా ఇంటి ప్రవేశ ద్వారాన్ని స్టైలిష్‌గా రూపొందించుకున్నా. ఈ మెయిన్‌ డోర్‌ నా ఇంటికి ట్రైలర్‌ లాంటిది. న్యూయార్క్‌, లండన్‌ దేశాల్లోని స్టైల్‌ ఉట్టిపడేలా ఇంటిలోని ప్రతి స్పేస్‌ని డిజైన్‌ చేశా. పనులు పూర్తి చేసుకొని ఇంటికి రాగానే రిలాక్స్‌ అయ్యేలా లివింగ్‌ ఏరియా ఏర్పాటు చేశా. ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ వంటలు చేయడమంటే నాకు ఇష్టం. అందుకే ఓపెన్‌ కిచెన్‌ బిల్డ్‌ చేశాం. నాకిష్టమైన సినిమాలు, సందేశాలతో ఓ వాల్‌ని సిద్ధం చేయించా. వాటిని చూస్తే నేనెప్పుడూ స్ఫూర్తి పొందుతా. మా ఫ్యామిలీ మొత్తం కలిసి బెడ్‌ రూమ్‌లోనే సినిమాలు చూస్తాం’’ అంటూ ఆమె తన ఇంటిని పరిచయం చేశారు. ఇప్పటివరకూ ఎవరికీ చూపించని తన వర్కింగ్‌ స్పేస్‌, స్టైలిష్‌ ఏరియాని సైతం ఆమె ఈ వీడియోలో చూపించారు. ఇందులో ఆమె ఎక్కువగా ఉపయోగించే హ్యాండ్‌ బ్యాగ్స్‌, చెప్పులు, మేకప్‌ సామాగ్రి ఉన్నాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు