Priyanka: ఆ రోజుల్లోకి వెళ్లినట్టుంది

శివ కార్తికేయన్‌, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన చిత్రం ‘డాన్‌’. ఈ నెల 13న విడుదల కానుంది. కాలేజీ దశ నుంచి పెళ్లి వరకు ఓ యువకుడి జీవితంలో ఏమి జరిగిందో వినోదాత్మకంగా చూపించడమే ‘డాన్‌’ కథ. తాజాగా ఇందులో తన పాత్ర గురించి

Updated : 09 May 2022 14:09 IST

శివ కార్తికేయన్‌, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన చిత్రం ‘డాన్‌’. ఈ నెల 13న విడుదల కానుంది. కాలేజీ దశ నుంచి పెళ్లి వరకు ఓ యువకుడి జీవితంలో ఏమి జరిగిందో వినోదాత్మకంగా చూపించడమే ‘డాన్‌’ కథ. తాజాగా ఇందులో తన పాత్ర గురించి ప్రియాంక మాట్లాడుతూ ‘‘ఈ చిత్రబృందం రూపంలో నాకో గ్యాంగ్‌ తయారైంది. మరోసారి నా కాలేజీ రోజుల్లోకి వెళ్లినట్లుంది. షూటింగ్‌ ఆద్యంతం ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అల్లరి మొత్తం గుర్తొంచింద’ని తన ఆనందాన్ని పంచుకుంది. ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యు’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. శిబి చక్రవర్తి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సముద్రఖని ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ‘డాక్టర్‌’ విజయంతో జోరుమీదున్న శివ కార్తికేయన్‌... ఈ చిత్రంతో మరోసారి తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు