Rowdy Rohini: ఆస్పత్రిలో నటి రౌడీ రోహిణి
‘బలగం’, ‘సేవ్ ది టైగర్స్’తో ఇటీవల అలరించిన నటి రోహిణి (Rohini) ఆస్పత్రిలో చేరారు.
హైదరాబాద్: ‘జబర్దస్త్’ ఫేమ్, నటి రౌడీ రోహిణి (Rohini) ఇటీవల ఆస్పత్రిలో చేరారు. కాలు సర్జరీ కోసం వెళ్లినట్టు తెలిపారు. అయితే సర్జరీ చేయడం కుదరదని వైద్యులు చెప్పారని వాపోయారు. ఈ మేరకు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.
‘‘సుమారు ఐదేళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ తర్వాత నా కాలులో రాడ్ వేశారు. దాన్ని తీయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే, వరుస షూటింగ్స్ వల్ల సర్జరీకి వెళ్లడం వీలుపడలేదు. కానీ, ఇప్పుడు కాస్త సమయం దొరికింది. రాడ్ తీయించి, ప్రశాంతంగా ఉందామని భావించి ఆస్పత్రికి వచ్చిన నాకు నిరాశే ఎదురైంది. చాలా కాలం కావడం చేత రాడ్ నా స్కిన్‌కు అటాచ్ అయిపోయిందని.. ఒకవేళ ఫోర్స్ పెట్టి తీస్తే మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు.’’ అని రోహిణి వాపోయారు. అయితే, రాడ్ తొలగించనప్పటికీ తన కాలుకి మైనర్ సర్జరీ చేశారని వెల్లడించారు.
సీరియల్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిణి ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’తో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు చిత్రాలు, సిరీస్‌ల్లో నటించారు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇటీవల విడుదలైన ‘బలగం’, ‘సేవ్ ది టైగర్స్’లో ఆమె నటన ఆకట్టుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
-
Ap-top-news News
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్