Samantha: విరాట్‌ కోహ్లీ నాకు స్ఫూర్తి.. అప్పుడు భావోద్వేగానికి లోనయ్యా: సమంత

సమంత, విజయ్‌ దేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వారిద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 13 May 2023 00:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) పలు విషయాల్లో తనకు స్ఫూర్తి అని ప్రముఖ హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) అన్నారు. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో కమ్‌బ్యాక్‌ సెంచరీ చేసినప్పుడు భావోద్వేగానికి లోనయ్యానన్నారు. ఓ ఛానెల్‌ ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో సమంత తనకు ఇష్టమైన క్రికెటర్లు గురించి మాట్లాడారు. కోహ్లీ స్ఫూర్తినిస్తుంటాడని చెప్పిన సామ్‌.. ఎం.ఎస్‌. ధోనీ (MS Dhoni) తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని, ఐపీఎల్‌లో చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తనకు ఇష్టమని వెల్లడించారు. విరాట్‌ కోహ్లీపై ఇష్టాన్ని సమంత పంచుకోవడంపై ఇరువురి అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. సమంతతోపాటు హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ఆ ఇంటర్వ్యూలో పాల్గొని, పలు విశేషాలు పంచుకున్నారు.

సమంత, విజయ్‌ కలిసి ‘ఖుషి’ (kushi) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వినూత్న ప్రేమకథా చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని తొలిగీతం ‘నా రోజా నువ్వే’ శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని