sreeleela: ‘ధమాకా’ షూటింగ్‌లో నాకది స్వీట్ మెమొరీ: శ్రీలీల
sreeleela: రవితేజతో కలిసి శ్రీలీల నుంచి మాస్ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘ధమాకా’. డిసెంబరు 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా శ్రీలీల పంచుకున్న విశేషాలు..
ఒకవైపు తన చదువు కొనసాగిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నానని కథానాయిక శ్రీలీల (sreeleela) చెప్పుకొచ్చింది. ‘పెళ్లి సందD’తో ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల భామ ఇప్పుడు రవితేజ (Ravi teja)తో కలిసి ‘ధమాకా’ చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకుడు. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్‌కానుకగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీలీల పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
పది నిమిషాలకే ఓకే చెప్పా!
‘‘త్రినాథరావు నక్కిన తీసిన ‘హలో గురు ప్రేమకోసమే’లో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయమయ్యారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ‘పెళ్లి సందD’’ విడుదల కాకముందే ‘ధమాకా’ కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే ప్రాజెక్ట్ చేశాను. ఎందుకంటే ఇది మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ. ఈ జానర్ సినిమాలంటే నాకూ ఇష్టమే’’
రవితేజ ఎంతో సపోర్ట్ చేశారు!
‘‘తక్కువ సమయంలోనే రాఘవేంద్రరావుగారు, రవితేజలాంటి మాస్ హీరోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ‘ధమాకా’లాంటి ఎంటర్‌టైనింగ్ ప్రాజెక్ట్ చేయడం నా అదృష్టం. మొదటి సినిమా అంతా కొత్తవారితో జరిగిపోయింది. రెండో సినిమా రవితేజలాంటి స్టార్ హీరో కావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డా. ఆయనతో మాట్లాడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. కానీ, రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు. నటనకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన నటించిన ‘కిక్’, ‘విక్రమార్కుడు’ చాలా సార్లు చూశా. పాత్రలో వేరియేషన్స్‌ని చాలా ఈజీగా చూపించగలరు. ఇంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారని ఆయన్ని అడుగుతూ ఉండేదాన్ని.
‘జింతాక్’ నా ఫేవరెట్ సాంగ్!
‘‘త్రినాథరావు దర్శకత్వం వహించిన ‘నేను లోకల్’లో పాటలు బాగా వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ చేసిన పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక ఈ చిత్రంలో ‘జింతాక్’ పాట బాగా నచ్చింది. ఇందులో నేను ప్రణవి పాత్రలో కనిపిస్తా. డ్యూయల్‌రోల్‌తో ట్రావెల్ అయినప్పుడు ఒక తికమక ఉంటుంది. ట్రైలర్‌లో చెప్పినట్లు ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా ఉంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్’’
షూటింగ్‌లో అది నాకు స్వీట్ మెమొరీ!
‘‘స్పెయిన్‌లో జింతాక్ పాట షూట్ చేసినప్పుడు ఒకరోజు నా కాస్ట్యూమ్స్ బ్యాగ్ కనిపించకుండా పోయింది. చాలా టెన్షన్ పడ్డాను. అయితే మేము ఉండే లొకేషన్ నుంచి మూడు గంటలు ప్రయాణించి మా డీవోపీ, డైరెక్టర్ నా కోసం షాపింగ్ చేసి అక్కడ నుంచి ఫొటోలు పెట్టి ఓకే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి క్యూట్ మూమెంట్. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’
వరుస సినిమాలు చేస్తున్నా!
‘‘ఒక వైపు నటిస్తూనే మరోవైపు మెడిసన్ చదువుతున్నా. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు చదువుకుంటా. ఇక బాలకృష్ణ గారు- అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. అలాగే బోయపాటి-రామ్ కాంబోలో ఒక మూవీ, వైష్ణవ్ తేజ్, నితిన్, వారాహి ప్రొడక్షన్‌లో ఇలా వేర్వేరు ప్రాజెక్టులకు ఓకే చెప్పా. ప్రస్తుతం ఇంకా కొన్ని కథలు వింటున్నా’’
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Education News
TSPSC: మరో నియామక పరీక్ష వాయిదా
-
Movies News
Dasara Memes: నాని ‘దసరా’.. ఈ మీమ్స్.. వైరల్ వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు!
-
Politics News
KTR: క్షమాపణలు చెబుతారా?.. రూ.100 కోట్లు చెల్లిస్తారా?: మంత్రి కేటీఆర్
-
India News
Smriti Irani: మరి అదానీతో వాద్రా ఎందుకున్నారు..? రాహుల్‌కు స్మృతి ఇరానీ కౌంటర్
-
Sports News
Rohit Sharma: కొత్త కిట్ కొనేందుకు రోహిత్ పాల ప్యాకెట్ల డెలివరీ చేశాడు: ఓజా
-
General News
HYderabad: మెట్రో విస్తరణపై కేంద్రానికి ఎందుకీ వివక్ష?: మంత్రి కేటీఆర్