Sunaina: రజనీకాంత్ సినిమా చూశాకే సౌత్‌లో హీరోయిన్‌గా చేయాలనుకున్నా: సునైన
హీరోయిన్ సునైన నటించిన తాజా చిత్రం ‘రెజినా’ (Regina). ఈ సినిమా ప్రమోషన్‌లో ఆమె మాట్లాడుతూ రజనీకాంత్ సినిమా చూశాక సౌత్‌లో హీరోయిన్‌గా నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
హైదరాబాద్: ‘రాజ రాజ చోర’ సినిమాతో తెలుగు వారికి ఎంతో చేరువైంది తమిళ నటి సునైన (Sunaina). త్వరలోనే ఈ అమ్మడు ‘రెజినా’ (Regina) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. మహిళా ప్రాధాన్య చిత్రంగా ఇది తెరకెక్కింది. జూన్ 23న సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునైన దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటించాలని రజనీకాంత్ సినిమా చూశాక నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
‘‘మాది ఉత్తరాదికి చెందిన కుటుంబం కావడం వల్ల చిన్నప్పుడు సౌత్ సినిమాలు చూడలేదు. అప్పడు హీరోయిన్ అవ్వాలని కూడా అనుకోలేదు. ఒకసారి రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) చూశాను. నటనపై ఆసక్తి కలిగింది. ఎప్పటికైనా సౌత్‌లో ఓ సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు సినిమాపై పెంచుకున్న ఆసక్తి ఇప్పుడు నన్ను మీ అందరికీ చేరువయ్యేలా చేసింది. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలన్నది నా కోరిక’’ అని సునైన చెప్పింది. ఇక ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘రెజీనా’ తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. మలయాళ దర్శకుడు డొమిన్ డిసిల్వా దీనికి దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Zoleka Mandela: నెల్సన్ మండేలా మనవరాలు కన్నుమూత
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్