Tamannaah: సినీ ప్రియులకు తమన్నా ప్రామిస్‌.. ఎందుకంటే..?

సినీ ప్రియులకు తమన్నా మాటిచ్చారు. తన తదుపరి ప్రాజెక్ట్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తానన్నారు. తాజాగా ట్విటర్‌ వేదికగా ముచ్చటించిన ఆమె నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు

Updated : 07 Jul 2022 18:42 IST

హైదరాబాద్‌: సినీ ప్రియులకు తమన్నా మాటిచ్చారు. తన తదుపరి ప్రాజెక్ట్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తానన్నారు. తాజాగా ట్విటర్‌ వేదికగా ముచ్చటించిన ఆమె నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. అంతేకాకుండా ‘ఎఫ్-3’లో అబ్బాయిగా నటించడం కష్టంగా అనిపించిందని తెలిపారు.

మీరు మళ్లీ తమిళ సినిమాల్లో ఎప్పుడు నటిస్తారు?

తమన్నా: అతి త్వరలో. 

మీ నుంచి హారర్‌ సినిమా ఆశించవచ్చా?

తమన్నా: నన్ను ఉత్కంఠకు గురిచేసే కథ వస్తే తప్పకుండా నటిస్తా.

మీ చర్మసౌందర్య రహస్యం ఏమిటి?

తమన్నా: పోషకాలు కలిగిన ఆహారం, సరిపడా విశ్రాంతి, కాస్త స్కిన్‌ కేర్‌.

మీరు కొవిడా? ఎందుకంటే మిమ్మల్ని చూసిన ప్రతిసారీ నా ఊపిరి ఆగిపోతోంది..! 

తమన్నా: ఫన్నీ.

అదృష్టాన్ని మీరు నమ్ముతారా?

తమన్నా: మన శ్రమకు ప్రకృతి కూడా సహకరిస్తే దాన్నే అదృష్టంగా భావిస్తా.

‘భోళాశంకర్‌’లో చిరుతో కలిసి డ్యాన్స్‌ చేస్తారా?

తమన్నా: మీరు ఏమాత్రం నిరాశకు లోనుకారని మాటిస్తున్నా.

చీర లేదా వెస్ట్రన్‌ దుస్తులు మీకు ఏది ఎక్కువగా ఇష్టం?

తమన్నా: ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టం.

‘ఎఫ్3’లో అబ్బాయి వేషంలో నటించడం ఎలా అనిపించింది?

తమన్నా: నాలోని రౌడీని ఈ పాత్రతో బయటపెట్టినట్లు ఉంది. ప్రతి సీన్‌ని బాగా ఎంజాయ్‌ చేశా.

మీకెలాంటి సినిమాలంటే ఇష్టం?

తమన్నా: యాక్షన్‌, రొమాన్స్‌

ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు?

తమన్నా: ఇష్టమైన పుస్తకాలు చదవడం, పాడ్‌కాస్ట్‌లు వినడం, వర్షంలో డ్యాన్స్‌ చేయడం

హాలీవుడ్‌ సినిమాల్లో నటించాలని ఉందా?

తమన్నా: ఉంది. అక్కడి నుంచి ఏదైనా ఆఫర్‌ వస్తే తప్పకుండా చేస్తా.

పూర్తిస్థాయి నృత్య కథా చిత్రంలో ఎప్పుడు నటిస్తారు?

తమన్నా: ఆతృతగా ఎదురుచూస్తోన్న. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌లో అదీ ఒకటి.

మీరు స్క్రిప్ట్స్‌ ఎలా సెలెక్ట్‌ చేసుకుంటారు?

తమన్నా: మిమ్మల్ని అన్ని విధాలుగా ఎంటర్‌టైన్‌ చేసే కథల కోసం నేను అన్వేషిస్తూనే ఉంటా.

మీరు సవాలుగా ఫీలైన పాత్ర ఏమిటి?

తమన్నా: ఎఫ్‌-3లో అబ్బాయిలా నటించడం చాలా కష్టంగా అనిపించింది.

ఛార్లి 777 చూశారా?

తమన్నా: నేను చూడలేదు. అమ్మవాళ్లు ఆ సినిమా చూశారు. వాళ్లకి బాగా నచ్చింది.

ఏ ఫిక్షనల్ పాత్రను రియల్‌లైఫ్‌లో కలవాలనుకుంటున్నారు?

తమన్నా: షెర్లాక్ హోమ్స్‌

కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి చేసిన పాత్రల్లో మీకెప్పటికీ గుర్తుండే పాత్ర?

తమన్నా: ధర్మదొరైలో సుహాసిని, బాహుబలిలో అవంతిక

మీరు ఎక్కువగా భయపడే విషయం ఏమిటి?

తమన్నా: జ్ఞాపకశక్తిని కోల్పోవడం.. ఆ మాటే నన్ను భయానికి గురి చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని