Alitho saradaga: ఆ సినిమాలో నిజమైన పాము నాకు బొట్టుపెట్టింది: వనిత

తెలుగులో మంచి విజయం సాధించిన ‘దేవి’ సినిమాలో సుశీలగా కనిపించి మెప్పించిన నటి వనిత. ఆ సినిమా తర్వాత ఏవో కారణాల వల్ల సినిమాలకు దూరమయింది. ఆమె ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమ్యే ‘ఆలీతో సరదాగా’లో వనిత పాల్గొని సందడి చేసింది.

Published : 11 Aug 2021 01:54 IST

నేను జూ.ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగులో మంచి విజయం సాధించిన ‘దేవి’ సినిమాలో సుశీలగా కనిపించి మెప్పించిన నటి వనిత. ఆ సినిమా తర్వాత ఏవో కారణాల వల్ల సినిమాలకు దూరమయింది. ఆమె ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమ్యే ‘ఆలీతో సరదాగా’లో వనిత పాల్గొని సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘దేవి’ సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో రాకపోవడానికి గల కారణాలతో పాటు.. తన కుటుంబ విషయాలు.. ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుందామె.. ఆమె మాటల్లోనే..

‘‘నేను మంజుల హౌజ్‌లో పుట్టాను. అందుకే నాకు నాగదేవత అంటే చాలా ఇష్టం. ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు ఆ హౌజ్‌లో షూటింగ్‌ జరిగాయి. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ఆ హౌజ్‌ను కొన్నారు. నాకు నాగదేవత అంటే చాలాఇష్టం.. ఆక్రమంలోనే ‘దేవి’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత కూడా తెలుగులో అవకాశాలు వచ్చాయి. అయితే.. నేను ప్రేమలో పడటం వల్ల ఆ సినిమాలు చేయలేకపోయాను. తెలుగు సినిమాల్లోకి రావాలని నాకూ ఉంది. ఇప్పుడు అవకాశం వస్తే కచ్చితంగా టాలీవుడ్‌లో చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జునగారు అంటే చాలా ఇష్టం. జూ.ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని. ఆయనతో జీవితంలో ఒక్క షాట్‌ అయినా చేయాలనేదే నా డ్రీమ్‌’’

‘‘దేవీ సినిమా క్లైమాక్స్‌లో నాకు పాము బొట్టు పెట్టే సన్నివేశం గ్రాఫిక్స్‌ కాదు. నిజంగానే నాగుపాము నాకు బొట్టుపెట్టింది. అయితే.. బొట్టుపెట్టి పుట్టలోకి వెళ్లే క్రమంలో నా చేతివేలిని నోటితో పట్టుకుంది. దాంతో రక్తం వచ్చింది. అప్పుడు మా అమ్మ ఒక్కమాటే అన్నారు. ‘తన(పాము) వల్ల చెయ్యి పోయినా కూడా ఫరవాలేదు’ అని చెప్పారు. మా కుటుంబంలో కొన్ని విబేధాల వల్ల పోలీస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది. అందులో నా తప్పేమీ లేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతో నా అనుకున్నవాళ్లు ఎవరూ లేరు(కన్నీళ్లు పెట్టుకుంటూ)’’ అని వనిత చెప్పుకొచ్చింది. ఈ పూర్తి ఎపిసోడ్‌ ఆగష్టు 16న రాత్రి 9.30గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి మరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని