Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మికి కొవిడ్.. ఇకనైనా ఆ విషయంలో పట్టుబట్టాలని పోస్ట్‌..!

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం.....

Published : 17 Jul 2022 10:51 IST

స్పందించిన రాధిక

హైదరాబాద్‌: నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం ఉదయం ఆమె వెల్లడించారు. కొవిడ్‌ ఇంకా మనల్ని వదిలిపోలేదని.. దయచేసి అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరుతూ ఆమె ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘అన్నిరకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే, సెట్‌లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా పట్టుబట్టాలి. ఎందుకంటే నటీనటులు అన్నిసార్లు సెట్‌లో మాస్కులు ధరించలేరు. కాబట్టి చుట్టూ ఉన్నవాళ్లందరూ ఇకనైనా మాస్కులు ధరించేలా చూసుకోవాలి’’  అని వరలక్ష్మి పేర్కొన్నారు. ఇక, ఆమె పెట్టిన పోస్టుపై సినీ ప్రముఖులు, నెటిజన్లు స్పందించారు. ‘‘గెట్‌ వెల్‌ సూన్‌ వరలక్ష్మి’’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక, నటి రాధిక స్పందిస్తూ..‘‘జాగ్రత్త వరూ.. నీకు మరింత ధైర్యం, బలం చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని అన్నారు.

కోలీవుడ్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చిన వరలక్ష్మి.. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’తో తెలుగువారికీ చేరువయ్యారు. ‘క్రాక్‌’తో జయమ్మగా లేడీ విలన్‌ రోల్స్‌కు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక, ప్రస్తుతం ఆమె ‘యశోద’, ‘హనుమాన్‌’, ‘బాలయ్య 107’, ‘శబరి’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని