Published : 27 Jan 2022 01:24 IST

RFC: రామోజీ ఫిల్మ్‌ సిటీలో నా జ్ఞాపకాలు.. నటి యమున RFC జర్నీ చూశారా?

హైదరాబాద్‌: రామోజీ ఫిల్మ్‌ సిటీ(Ramoji flim city)లో తనకు ఎన్నో మధురస్మృతులు ఉన్నాయంటున్నారు నటి యమున. తాజాగా ఆమె ఆర్‌ఎఫ్‌సీ టూర్‌ వీడియో రూపొందించి తన యూట్యూబ్‌ ఛానల్‌(మీ యమున)లో పోస్టు చేశారు. గతంలో ఈటీవీలో ప్రసారమైన ‘అన్వేషిత’, ‘విధి’ ‘అగ్నిగుండం’ తదితర సీరియళ్లలో యమున కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీరియల్‌లోనూ ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియళ్లకు సంబంధించిన షూటింగ్స్‌ అన్నీ రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎఫ్‌సీతో తన జ్ఞాపకాలను యమున తాజాగా గుర్తుచేసుకున్నారు. సీరియల్స్‌ షూటింగ్‌ జరిగిన ప్రాంతాల్ని, RFC విశేషాలను వీడియోలో చూపించారు. ‘అన్వేషిత’ సీరియల్‌ కన్నా ముందు ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌ కోసం తొలిసారి ఇక్కడకు  వచ్చానని చెప్పారు. రామోజీ సంస్థల అధినేత రామోజీరావు, దివంగత నటుడు, దర్శకుడు సుమన్‌ తనకు ఎన్నో మంచి పాత్రలు ఇచ్చారని, తనని ఒక సోదరిలా చూసుకున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని