The Kerala Story: మైనస్ 16 డిగ్రీల వాతావరణంలో 40 గంటలు ఉన్నా: అదా శర్మ
‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను అదా శర్మ (Adah sharma) షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సినిమా షూటింగ్ అంటే నటీనటులు ఎంత కష్టపడతారో తెలిసిన విషయమే. వాతావరణాన్ని లెక్కచేయకుండా ఎండ, వానల్లో సన్నివేశాలు చిత్రీకరిస్తారు. కొన్ని సన్నివేశాలు సహజంగా రావడానికి దెబ్బలను సైతం లెక్కచేయకుండా నటిస్తారు. అయితే ఈ తెరవెనుక కష్టాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. షూటింగ్ సమయంలో తానెంత ఇబ్బంది పడిందో అదా శర్మ (Adah sharma) తెలిపింది.
అదా శర్మ ప్రధాన పాత్రలో ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం ఆమె ఎంత కష్టపడిందో తెలిసేలా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. ‘‘మైనస్ 16 డిగ్రీల వాతావరణంలో 40 గంటలు ఉన్నాం. దీంతో డీ హైడ్రేషన్ కారణంగా నా పెదవులు మొత్తం పగిలిపోయాయి. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న పరుపు.. నేను రాళ్లల్లో కిందపడే సమయానికి వేద్దామనుకున్నారు. కానీ దాన్ని మేము ఉపయోగించలేదు. దీంతో నా మోకాళ్లు, మోచేతులకు దెబ్బలు తగిలాయి. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినందుకు ఆనందంగా ఉంది’’ అంటూ అదా శర్మ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన వారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇవి చూశాక మీపై గౌరవం పెరిగింది’ అని కామెంట్స్ పెడుతున్నారు. సుదీప్తోసేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ మే 5న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.