Bheemla Nayak: ‘భీమ్లానాయక్‌’ నుంచి ‘అడవి తల్లి మాట’.. పాట వచ్చేసింది

‘భీమ్లానాయక్‌’ పాటల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. అడవి తల్లి మాట... అంటూ సాగే ఇందులోని నాలుగో పాటని శనివారం విడుదల చేస్తున్నారు.

Updated : 07 Dec 2022 19:12 IST

హైదరాబాద్‌: ‘భీమ్లానాయక్‌’ పాటల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. అడవి తల్లి మాట... అంటూ సాగే ఇందులోని నాలుగో పాటని శనివారం విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. త్రివిక్రమ్‌ రచన చేస్తున్నారు. తమన్‌ స్వరకర్త. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని