Adi Purush: ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ‘ఆది పురుష్‌’ టీజర్‌ విడుదల ఆ రోజే..

ప్రభాస్‌ అభిమానులతోపాటు యావత్‌ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆది పురుష్‌’.

Published : 27 Sep 2022 13:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) అభిమానులతోపాటు యావత్‌ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆది పురుష్‌’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం కావటంతో ప్రారంభం నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ఫ్యాన్స్‌ ఎదురుచూశారు. ఎంతకీ స్పందించకపోవటంతో సోషల్‌ మీడియా వేదికగా కొందరు చిత్ర బృందంపై ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, త్వరలోనే టీజర్‌ లాంఛ్‌ అవుతుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది. ఆ అప్‌డేట్లు ఏ తేదీన వస్తాయో చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut) అధికారికంగా ప్రకటించారు.

అక్టోబరు 2న సరయు నది (అయోధ్య) తీరాన టీజర్‌, ఫస్ట్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ‘మా మ్యాజికల్‌ ప్రయాణాన్ని ఇప్పటి నుంచి మీరు అనుభూతి చెందండి.. ప్రేమించండి’ అని ఓం రౌత్‌ పేర్కొన్నారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో ప్రభాస్‌ రాఘవగా, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌, కథానాయిక కృతి సనన్‌ జానకిగా, సన్నీ సింగ్‌ లక్ష్మణగా కనిపించనున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్ర పోషించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని