Adipurush: ‘ఆదిపురుష్‌’పై ట్రోలింగ్‌.. డ్యామేజ్‌ కంట్రోల్‌ పనిలో చిత్ర బృందం

ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్‌ మూవీ ‘ఆదిపురుష్’ (Adipursh).

Published : 06 Oct 2022 01:48 IST

హైదరాబాద్‌: ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్‌ మూవీ ‘ఆదిపురుష్’ (Adipursh). తాజాగా విడుదలైన టీజర్‌పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం ఆదిపురుష్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రామాయణంలోని పాత్రలను అపహాస్యం చేస్తూ విజువల్ ఎఫెక్ట్స్ జోడించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం ‘ఆదిపురుష్’ టీజర్‌ను హైదరాబాద్ వేదికగా 3డీలోనూ విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఆదిపురుష్ చిత్రంపై వస్తున్న విమర్శలకు ముగింపు పలకాలని భావిస్తోంది.

‘ఆదిపురుష్’ టీజర్‌పై సినీ విమర్శలు, హిందూత్వ వాదులు, రాజకీయ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.... అందులోని పాత్రల ఆహార్యంపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా ‘ఆదిపురుష్’ టీజర్‌ను 3డీలో విడుదల చేయబోతున్నారు. ఈ వేడుకకు దర్శకుడు ఓంరౌత్, కథానాయకుడు ప్రభాస్  హాజరుకానున్నారు. ఈ వేడుకలో ఆదిపురుష్ చిత్రంపై వస్తున్న విమర్శలకు పూర్తి వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని