Adipurush: ‘ఆది పురుష్’ టీజర్ ట్రోలింగ్.. స్పందించిన దర్శకుడు ఓం రౌత్!
‘ఆది పురుష్’ టీజర్‌పై సోషల్‌మీడియాలో జరుగుతున్న ట్రోల్ గురించి దర్శకుడు ఓం రౌత్ స్పందించారు.
ముంబయి: ప్రభాస్ (Prabhas) రాముడి పాత్రలో ఓం రౌత్ (Om Raut) రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆది పురుష్’ (Adipurush). కృతిసనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేష్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌పై సినీ అభిమానులతో పాటు, విమర్శకులు సైతం పెదవి విరిచారు. సోషల్‌మీడియాలో అయితే, విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో టీజర్‌ని 3డీలో స్క్రీనింగ్ వేశారు. దీనిని చూసిన వారందరూ యూట్యూబ్‌లో విడుదలైన టీజర్‌ను 3డీలో చూస్తుంటే అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. విజువల్ వండర్‌గా ఓం రౌత్దీన్ని తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు సోషల్‌మీడియాలో ట్రోల్‌పై దర్శకుడు ఓం రౌత్ కూడా స్పందించారు.
‘‘ఆది పురుష్’ టీజర్ విడుదలైన తర్వాత వస్తున్న ట్రోలింగ్ చూసి నేను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవం. అయితే, ట్రోలింగ్ వల్ల నేనేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమా వెండితెర కోసం తీశాం. థియేటర్లో తెరసైజు తగ్గచ్చేమో కానీ, ఆ పరిమాణాన్ని మరీ మొబైల్‌కు తగ్గించకూడదు. అలా చేస్తే, అస్సలు బాగోదు. నాకు అవకాశం ఇస్తే, యూట్యూబ్‌లో పెట్టకుండా చేయొచ్చు. నాకు అది కేవలం ఓ గంట పని. కానీ, అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనూ యూట్యూబ్ ఆడియెన్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని అన్నారు.
‘‘నా భాగస్వాములు, స్టూడియో(టీ-సిరీస్) ప్రపంచంలోనే అతి పెద్ద యూట్యూబ్ ఛానెల్. చాలా అరుదుగా సినిమా చూసే వాళ్ల కోసం దీన్ని తీయలేదు. థియేటర్‌కు దూరమైన పెద్దవాళ్లు, అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్లను సినిమా థియేటర్‌కు రప్పించే ఉద్దేశంతో తీశాం. ఎందుకంటే ఇది రామాయణం. గ్లోబల్ కంటెంట్ కోరుకుంటున్న తర్వాతి జనరేషన్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నాం. వారికి అర్ధమయ్యే భాషలో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మేము ఈ మార్గాన్ని(3డీ మోషన్ క్యాప్చర్)ను ఎంచుకున్నాం’’ అని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. చిన్న తెరలపై చూడటానికి మాత్రం ‘ఆది పురుష్’ తీయలేదని పెద్ద తెరపై చూస్తేనే తాము తీసే కంటెంట్ విలువ తెలుస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ‘ఆది పురుష్’ వీఎఫ్ఎక్స్ వర్క్‌పై వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో ఇప్పటివరకూ తీసిన ఫుటేజ్‌ను మరింత మెరుగు పర్చేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్