‘ఆదిపురుష్‌’ సంగీత దర్శకులు ఎవరంటే!

‘బాహుబలి’ హీరో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్‌ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్‌ ముంబయిలో ప్రారంభమైంది.

Published : 08 Jun 2021 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘బాహుబలి’ హీరో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్‌ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్‌ ముంబయిలో ప్రారంభమైంది. అక్కడ కొంతమేర షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ రెండో దశతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసేది ఎవరనేది ఇప్పటి వరకు చిత్రబృందం చెప్పలేదు. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకులు సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు ఈ సినిమాకి పనిచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరు గతంలో ప్రభాస్‌ నటించిన ‘సాహో’ చిత్రంలోని ‘‘సైకో సైయాన్’’ అనే పాటకి సంగీత స్వరాలు అందించారు. ఇంకా ‘ఏక్ ప్రేమ్ కథ’, ‘కబీర్ సింగ్’, ‘పతి పత్ని ఔర్‌ వో’, ‘తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ వంటి బాలీవుడ్‌ చిత్రాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ - మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. సినిమాకి కార్తిక్‌ పళని ఛాయగ్రాహకుడిగా పనిచేస్తుండగా ఎడిటర్లుగా అపూర్వ మోతివాలే, ఆశిష్‌ మాత్రేలు వ్యవహరిస్తున్నారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్  పతాకంపై రూపొందుతున్న చిత్రానికి భూషణ్ కుమార్‌, కిషన్‌ కుమార్‌ నిర్మాతలు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న తెరపైకి రానుంది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు