Adipurush: ‘ఆదిపురుష్’ కోసం ముంబయి నుంచి తిరుపతికి బైక్‌పై!
తమ అభిమాన తారల్ని కలుసుకునేందుకు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వచ్చిన అభిమానుల్ని.. వేల కిలోమీటర్లు బైకు యాత్రలు చేసిన సినీ ప్రేమికుల్ని తరచూ చూస్తూనే ఉంటాం.
తమ అభిమాన తారల్ని కలుసుకునేందుకు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వచ్చిన అభిమానుల్ని.. వేల కిలోమీటర్లు బైకు యాత్రలు చేసిన సినీ ప్రేమికుల్ని తరచూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడిలాంటి ఓ వినూత్న ప్రయత్నాన్ని ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా కోసం చేసేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్ సంగీత దర్శకుడు అతుల్. ఆయన తన సోదరుడు అజయ్‌తో కలిసి ఈ సినిమాకి సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్ (Prabhas) నటించగా.. జానకి పాత్రను కృతిసనన్ పోషించింది. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ చిత్ర విడుదల ముందస్తు వేడుకను ఈ నెల 6న తిరుపతిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం ముంబయి నుంచి తిరుపతికి బైక్‌పై రానున్నారు సంగీత దర్శకుడు అతుల్. ఆయన శనివారం ముంబయి నుంచి బయలుదేరి సోమవారం తిరుపతికి చేరుకోనున్నారు. అనంతరం ఆయన సోదరుడు అజయ్‌తో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని.. స్వామి వారి పాదాల వద్ద ‘‘జైశ్రీరామ్’’ పాటను సమర్పించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా
-
Gunniness Record: ఒక్కరోజే 3,797 ఈసీజీలు.. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో చోటు