Adipurush: ‘ఆదిపురుష్‌’ ఆఫర్‌.. ఒక టికెట్‌ ధరకు రెండు!

ప్రభాస్‌, కృతిసనన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆదిపురుష్’. ఒక టికెట్‌ ధరకే రెండు టికెట్లు పొందొచ్చని టీమ్‌ ప్రకటించింది.

Published : 11 May 2023 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ (adipurush) చిత్ర బృందం ప్రేక్షకులకు ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. ‘పేటీఎం’ (paytm) ద్వారా ఆ ఛాన్స్‌ పొందొచ్చని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. అయితే, ఇందుకు షరతులు మాత్రం వర్తిస్తాయని వెల్లడించిన పేటీఎం.. ఈ ఆఫర్‌ జూన్‌ 30 వరకే ఉంటుందని తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా ముందుగా రూ.100 చెల్లిస్తే ప్రోమో కోడ్‌ వస్తుందని, టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు దాన్ని అప్లై చేస్తే రూ. 400 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని పేర్కొంది. కనీసం రూ. 350 ధర ఉన్న టికెట్‌కే ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. అంటే.. రెండు టికెట్లు బుక్‌ చేయాల్సి వస్తే ట్యాక్స్‌తో కలిపి రూ.700కిపైగా అవుతుంది. అదే పేటీఎం ఆఫర్‌ కోడ్‌ని ఉపయోగిస్తే సగానికి తగ్గే అవకాశం ఉందన్నమాట. 

ప్రభాస్‌ (prabhas) హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 3డీ వెర్షన్‌లో ఈ సినిమాని రూపొందించారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటించగా కృతిసనన్‌ సీతగా నటించారు. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ కనిపించునున్నారు. ఈ సినిమా జూన్‌ 16న విడుదలకానుంది. అంతకంటే ముందు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక ‘ట్రిబెకా ఫెస్టివల్‌’లో ప్రదర్శించనున్నారు. న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 18 వరకు జరగనున్న ఆ వేడుకలో ‘ఆదిపురుష్‌’ను జూన్‌ 13న ప్రదర్శిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని