Adipurush: రఘునందుడి గాథ... ఆదిపురుష్‌

అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి అంటూ సైన్యానికి  పిలుపునిచ్చాడు రాఘవుడు.

Updated : 10 May 2023 12:36 IST

అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి అంటూ సైన్యానికి  పిలుపునిచ్చాడు రాఘవుడు. జై శ్రీరామ్‌ అంటూ ఆయన నామాన్నే తలచుకుని రంగంలోకి దిగిన రామదండు ఎలా పోరాటం సాగించిందో తెలియాలంటే ‘ఆదిపురుష్‌’ (Adipurush) చూడాల్సిందే. ప్రభాస్‌ (Prabhas), కృతిసనన్‌ (Kriti Sanon) జంటగా నటించిన చిత్రమిది. సైఫ్‌ అలీఖాన్‌ ముఖ్యభూమిక పోషించారు. ఓం రౌత్‌ దర్శకుడు. భూషణ్‌ కుమార్‌, క్రిష్ణకుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతారియా, రాజేష్‌ నాయర్‌, వంశీ, ప్రమోద్‌ కలిసి నిర్మించారు. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రమిది. జూన్‌ 16న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికీ, సన్మార్గానికీ నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం, జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం’ అంటూ హనుమంతుడి మాటలతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. అత్యాధునిక సాంకేతిక హంగులతో చిత్రాన్ని రూపొందించారు. సన్నీసింగ్‌, దేవదత్త నాగే వత్సల్‌ సేన్‌, సోనాల్‌ చౌహాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్‌ పల్నాని, సంగీతం: అజయ్‌ - అతుల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని