పాజిటివ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తా

‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న నటి అదితిరావు హైదరి. గత ఏడాదిలో నాని, సుధీర్‌బాబు కలిసి నటించిన ‘వి’లోనూ సందడి చేసింది. ‘‘మనల్ని వేరొకరితో పోల్చడం లేదా ఎక్కువగా విమర్శించడం అనేవి’’ నిత్యం మనం జీవితంలో జరిగేదే అని చెబుతోంది నటి అదితిరావు.

Published : 24 Mar 2021 02:13 IST

న్యూదిల్లీ: ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న నటి అదితిరావు హైదరి. గత ఏడాదిలో నాని, సుధీర్‌బాబు కలిసి నటించిన ‘వి’లోనూ సందడి చేసింది. ‘‘మనల్ని వేరొకరితో పోల్చడం లేదా 
ఎక్కువగా విమర్శించడం అనేవి’’ నిత్యం మనం జీవితంలో జరిగేదే అని చెబుతోంది నటి అదితిరావు. జీవితంలోని కొన్ని విషయాల గురించి అదితిరావు స్పందిస్తూ..‘‘ఒక్కోసారి ప్రజలు మనల్ని బాగా విమర్శిస్తారు. వేరొకరితో పోలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు నా మనసు కొంచెం బాధపడుతుంది. అయినా ప్రతి విషయాన్ని స్వీకరిస్తాను. అనుభూతి చెందుతాను. బిగ్గరగా నవ్వుతాను. దాంతో అక్కడితో ఆగిపోతా. ఓ నటిగా సున్నితంగా ఉండగలను. అంతేకాదు కష్టతరమైన రోజుల్లో కఠినంగానే ఉంటాను. అప్పుడు కూడా వేరొక మార్గాన్ని అనురిస్తూ పాజిటివ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తా. కొన్ని సందర్భాల్లో మన నటన నచ్చకపోవచ్చు. అప్పుడు తిరస్కరిస్తారు. అదంతా మన వ్యక్తిగతమైనదే. ఇలాంటి సమయంలో కొంచెం బాధగా ఉంటుంది. మీరు నన్ను ఏ చీకటి ప్రదేశంలోనైనా ఉంచండి. నేను మాత్రం సూర్య కిరణాల కోసం ఎదురు చూస్తుంటా. నేను చాలా వరకూ తక్కువగా బాధపడుతుంటా. నిత్యం సరదాగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటా. ఊరికే ఒంటరిగా కూర్చుని బాధపడడం నాకు ఇష్టం ఉండదు. నేను ఆ రకం వ్యక్తిని కాదు’ అని తెలిపింది. 

ప్రస్తుతం అదితిరావు అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ‘మహాసముద్రం’లో నటిస్తోంది. ఇందులో శర్వానంద్‌, సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ మరో
నాయిక. దుల్కర్ సల్మాన్‌, కాజల్ అగర్వాల్‌తో కలిసి ‘హే సినామిక’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్‌లో మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కిన ‘ది గర్ల్‌ ఆన్‌ ది
ట్రైన్‌’ చిత్రంలో నుష్రత్ జాన్‌ అనే పాత్రలో నటించింది. ఇందులో పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. రిభూ దాస్‌గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్బింగ్‌ అయ్యింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని