Cinema News: నవతరం ప్రేమకథతో...

శ్రీ ఆదిత్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిత్య టీ 20 లవ్‌స్టోరి’. రమ్య, పవిత్ర, మాధురి కథానాయికలు. చిన్ని చరణ్‌ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. ‘‘నవతరం ప్రేమకథ ఇది.

Updated : 23 Jul 2022 08:18 IST

శ్రీ ఆదిత్య (Sri Adutya) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిత్య టీ 20 లవ్‌స్టోరి’ (Aditya T 20 Lovestory). రమ్య, పవిత్ర, మాధురి కథానాయికలు. చిన్ని చరణ్‌ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV) విడుదల చేశారు. ‘‘నవతరం ప్రేమకథ ఇది. ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతుంది. శ్రీ ఆదిత్య స్టైలిష్‌గా కనిపిస్తారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. విజయ రంగరాజు, దత్తు, రాజనాల, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చినబాబు అడపా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని