Major: ‘మేజర్‌’ టికెట్‌ రేట్లపై అడివి శేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబయి ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని, అడివి శేష్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా సిద్ధమైన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించి....

Updated : 23 May 2022 11:49 IST

హైదరాబాద్‌: ముంబయి ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని, అడివి శేష్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా సిద్ధమైన చిత్రం ‘మేజర్‌’. ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు నిర్మాత. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్‌ 03న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శేష్‌ ట్విటర్‌ చాట్‌ ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

‘మేజర్‌’లో ఏం చూపించనున్నారు?

‘‘మేజర్‌’ చిత్రంలో మనకు తెలియని సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని చూపించాం. ‘క్షణం’ ‘గూఢచారి’, ‘ఎవరు’ ఈ సినిమాలను మించి ‘మేజర్‌’ ఉంటుంది. 

‘‘సినిమా టికెట్‌ ధరలు తగ్గిస్తే మేము రిపీట్‌ మోడ్‌లో చిత్రాలను చూస్తాం.. మీరేమంటారు..?

‘‘మేజర్‌’ చిత్రానికి టికెట్‌ రేట్లు సాధారణంగానే ఉంటాయి. ఎందుకంటే, సామాన్యులు చూడాల్సిన అసాధారణచిత్రమిది.

టికెట్‌ రేట్లపై శేష్‌ క్లారిటీ ఇవ్వడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవిక సంఘటనలు ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, మురళీ శర్మ, సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ్ల కీలకపాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని