HIT2: ఈ సినిమా ఇంటర్వెల్ లేకుండా చూడాలి.. అదిరిపోతుంది: అడవిశేష్
అడవి శేష్ కీలక పాత్రలో శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్2’. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అడవి శేష్ పంచుకున్న విశేషాలు..
వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్నారు నటుడు అడవి శేష్. ఆయన కీలక పాత్రలో శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్2’. మీనాక్షి చౌదరి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు, తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నారు అడవి శేష్.
రిలీజ్‌కు ముందు టెన్షన్ పడుతున్నారా? ఆనందంగా ఉన్నారా?
అడవి శేష్: ఎవరికైనా రిలీజ్‌కు ముందు టెన్షన్ ఉంటుంది. నన్ను వదిలేస్తే నేను ఒకే షాటు 1000 సార్లు షూట్ చేస్తా. ప్రతి సినిమాకు నేను ఎంతవరకు న్యాయం చేయగలిగాను అని అనుకుంటాను.
‘హిట్-1’ సక్సెస్ అయింది ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఎలా ఫీల్ అవుతున్నారు?
అడవి శేష్: మొదట ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు ‘నేను చేయను’ అని చెప్పా. ఎందుకంటే మొదటిపార్ట్ విశ్వక్సేన్ కదా. నేను తన ప్రాజెక్ట్ లాగేసుకున్నట్లు ఉంటుందన్నాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల స్క్రిప్ట్ విషయంలో నా ప్రమేయం కొంతైనా ఉంది. ఈ సినిమాలో అసలు ఏమీ లేదు. సాధారణంగా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ సినిమాల్లో కిల్లర్ పాత్ర ఎవరు చేశారు? అనేది ఆసక్తిగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఎందుకు హత్య చేశారు? అనే అంశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేమ, అమ్మనాన్నల ఆప్యాయత ఇలా అన్నింటి గురించి ఇందులో చూపించారు.
హీరో నాని యాక్టర్‌గా, నిర్మాతగా ఎలా అనిపించారు?
అడవి శేష్:నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఒక నటుడు ఎలా ఫీల్ అవుతున్నాడో నానికి మనం చెప్పకుండానే అర్థమవుతుంది. నేను మొహమాటం వల్ల చెప్పలేకపోయినవి కూడా తను అర్థంచేసుకున్నారు. నాకు సహజంగానే సందేహాలు ఎక్కువ ఉంటాయి. వాటికి సహనంతో సమాధానాలు చెప్పారు.
‘హిట్2’ కథ గురించి చెప్పండి?
అడవి శేష్: కథలో మీనాక్షి పాత్ర చాలా కీలకమైనది. నలుగురు పోలీసు అధికారులు కలిసి కొన్ని కేసులను ఛేదిస్తారు. వాటిల్లో చివరి కేసు నేషనల్ లెవల్లో ఉంటుంది. నాకు ‘ఖైదీ’ సినిమా చాలా ఇష్టం. అలాగే ‘విక్రమ్’ కూడా. ‘హిట్2’ ‘విక్రమ్’లా ఆడాలని కోరుకుంటున్నా. ఈ సినిమా నిజానికి ఇంటర్వెల్ లేకుండా చూడాలి. అప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు.
మేజర్, హిట్ సినిమాలు రెండు ఒకేలా ఉంటాయా?
అడవి శేష్: నా కెరీర్లో మొదటిసారి ఒకే సంవత్సరం రెండు సినిమాలు వస్తున్నాయి. ‘మేజర్’ ఎమోషనల్‌గా నేను చాలా బాధ్యతగా ఉన్నాను. అలాంటి సినిమా అందరి అనుమతులు తీసుకొని చేయాలి. బయోపిక్ కాబట్టి తల్లిదండ్రుల అనుమతి, ఆర్మీ ఇలా అందరి నుంచి తీసుకోవాలి. కానీ, హిట్ సినిమా ప్రేక్షకులకు నచ్చితే చాలు. మేజర్‌తో పోలిస్తే ఈ సినిమాకు నాకు ఒత్తిడి తగ్గింది. నేను హారర్, డ్రగ్స్‌కు సంబంధించిన సినిమాలు చూడలేను. కానీ ఈ సినిమాలో హారర్ వేరుగా ఉంటుంది. అప్పటికీ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక నేను చాలా డల్ అయ్యేవాడిని. క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ‘హిట్2’ హిందీ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తాం. నేనే డబ్బింగ్ చెబుతా. ముంబయి, దిల్లీ లాంటి అన్ని ప్రముఖ నగరాల్లో ప్రమోషన్స్ ఇచ్చాక హిందీలో విడుదల చేస్తాం. ప్రస్తుతానికి డిసెంబర్ 30న అనుకుంటున్నాం. అలాగే కన్నడంలో కూడా డబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం.
హిందీ విడుదలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?విశ్వక్సేన్తో ఎప్పుడైనా మాట్లాడారా?
అడవి శేష్: ఏ సినిమా అయినా కథ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. కొన్ని కోట్లు పెట్టి తీసే సినిమా అలా లీక్ అయితే చాలా కష్టం. ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు బాగా ఆదరణ ఉంది. కొన్ని కథలు హిందీ ప్రేక్షకులకు నచ్చుతాయి. కొన్ని కథలు తెలుగు వాళ్లని ఆకర్షిస్తాయి. విశ్వక్సేన్తో గతంలో పెద్దగా పరిచయం లేదు. కా,నీ ఈ సినిమా మేకింగ్ అప్పుడు బాగా క్లోజ్ అయ్యాడు. హిట్2కు సంబంధించి ప్రచారంలో తను కూడా చురుగ్గా పాల్గొన్నాడు.
మీ లైఫ్‌ని ‘గూఢచారి’ మలుపు తిప్పిందా? భవిష్యత్‌లో ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు!
అడవి శేష్: నాకు ఉత్తరాదిన ‘గూఢచారి’ కంటే ‘క్షణం’ మూవీకి ఎక్కువ ఆదరణ లభించింది. ‘క్షణం’ రైట్స్ పోటీపడి కొన్నారు. ఆ సినిమా అక్కడ కమర్షియల్‌గా బాగా సక్సెస్ అయింది. నాకు సినిమాలంటే తపన ఎక్కువ. మహేశ్ బాబు ‘మురారి’ రిలీజ్ అయినప్పుడు నేను విదేశాల్లో ఉన్నా. గంటన్నరసేపు జర్నీ చేసి ఆ సినిమా చూడడానికి వెళ్లాను. అలా మహేశ్ సినిమా చూసిన నేను తనతో కలిసి మేజర్‌కు పనిచేశా. అలాగే హీరో నాని కూడా నాకు ఇష్టమైన నటుల్లో ఒకరు. నాని లాంటి వాళ్లు సౌత్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు. హిట్2 తర్వాత ఆస్కార్ సినిమా ఒకటి డబ్బింగ్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్ ఉంటే కామెడీ సినిమాలు చేయడానికైనా సిద్ధమే. అందరి ఆర్టిస్టుల జీవితాలు స్టాక్ మార్కెట్లాంటివి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Taraka Ratna: మరిన్ని పరీక్షల తర్వాత తారకరత్న ఆరోగ్యంపై స్పష్టత
-
Sports News
Suryakumar Yadav : ఇది ‘స్కై’ భిన్నమైన వెర్షన్ : తన ఇన్నింగ్స్‌పై సూర్య స్పందన ఇది..
-
Crime News
Kothagudem: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. బాధితుల్లో 15 మంది మైనర్ బాలికలు?
-
Movies News
Rajinikanth: ‘వీర సింహారెడ్డి’ దర్శకుడికి రజనీకాంత్ ఫోన్ కాల్.. ఎందుకంటే?
-
Sports News
Djokovic: అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా..
-
World News
H1b Visa: మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ