Adivi Sesh: శేష్.. మీకెందుకంత పక్షపాతం అంటూ నెటిజన్ ట్వీట్.. నటుడి కౌంటర్
నటుడు అడివి శేష్ తాజాగా అభిమానులతో ముచ్చటించారు. ‘హిట్-2’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన ట్విటర్ వేదికగా #AskSesh సెషన్ నిర్వహించారు.
హైదరాబాద్: ‘క్షణం’ (Kshanam) నుంచి ‘హిట్-2’ (HIT2) వరకు వరుసగా ఆరు సినిమాలతో హీరోగా విజయాన్ని అందుకున్న నటుడు అడివి శేష్ (Adivi Sesh). ప్రస్తుతం ‘హిట్-2’ విజయోత్సవ యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోన్న ఆయన తాజాగా ట్విటర్ చాట్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
‘గూఢచారి-2’ రిలీజ్ ఎప్పుడు?
శేష్: ప్రస్తుతం ‘హిట్-2’ విజయాన్ని ఆనందిస్తున్నా. త్వరలోనే ‘గూఢచారి-2’ కథ రాసి.. అద్భుతమైన దర్శకుడు వినయ్‌తో ఈ సినిమా చేస్తా.
మీకు బాగా నచ్చిన మ్యూజిక్ కంపోజర్ ఎవరు?
శేష్: హన్స్ జిమ్మెర్, థామస్ న్యూమాన్, అనిరుధ్, శ్రీచరణ్ పాకాల.
‘హిట్-2’ చాలా బాగుంది? మీరు బెంగళూరు ఎప్పుడు వస్తారు?
శేష్: ఇటీవల ‘హిట్-2’ ప్రమోషన్స్ కోసం అక్కడికి వచ్చాను. త్వరలోనే నా తదుపరి సినిమా షూట్ కోసం కూడా రావొచ్చు. ఆ నగరం నాకెంతో నచ్చింది.
శోభూ యార్లగడ్డ: కంగ్రాట్స్ శేష్..!
శేష్: సార్.. కార్తికేయ, కరుణ్ ‘హిట్-2’ చూశారు. మరి మీరెప్పుడు చూస్తారు? మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీరు నాకు ఇస్తోన్న సపోర్ట్‌ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా.
రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ఎప్పుడు సినిమా చేస్తారు?
శేష్: రాహుల్ బ్రో.. అదీ సంగతి!
మీరు యాక్షన్ మూవీ చేస్తే చూడాలని ఉంది?
శేష్: నెట్‌ఫ్లిక్స్‌లో ‘మేజర్’ అందుబాటులో ఉంది. అలాగే థియేటర్‌లో ‘హిట్-2’ చూడండి.
హిట్‌వర్స్‌లో మీకూ, విశ్వక్‌సేన్‌కు ఫైట్ ఉండే అవకాశం ఉందా?
శేష్: ఉంటే ఉండొచ్చు. నేను కూడా దర్శకుడు శైలేష్‌ను అడగలేదు.
అమ్మాయిలకే రిప్లైలు ఇస్తున్నావు. అబ్బాయిలకు ఇవ్వడం లేదు. ఎందుకంత పక్షపాతం?
శేష్: అబ్బాయిలు.. తన గర్ల్‌ఫ్రెండ్స్‌ని మాత్రమే సినిమాలకు తీసుకువెళ్తున్నారు. అమ్మాయిలు అయితే కుటుంబం మొత్తాన్ని థియేటర్‌కు తీసుకువెళ్తున్నారు. అదీ లెక్కా. నేను సరదాగా అన్నాను. ఎవరినైనా ఒకేలా ఇష్టపడతాను.
సినిమా కథలను మీరు ఎలా ఎంచుకుంటున్నారు?
శేష్: సినిమా కథల విషయంలో నేను చాలా తేలికగా నిర్ణయం తీసుకుంటా. ఎవరైనా నాకు కథలు చెప్పినప్పుడు ప్రేక్షకుడిగా వింటాను. ఒకవేళ అది బోర్ కొడితే వెంటనే నో అని చెప్పేస్తాను. ఆసక్తిగా అనిపిస్తే ఓకే చెబుతాను. హీరోగా ఎప్పుడూ కథలు వినలేదు. సినిమాల్లో బిల్డప్ అనేది అవసరం లేదు. సినిమా బాగుంటే ప్రేక్షకులే నాకు బయట బిల్డప్ ఇస్తారు. ‘హిట్-2’ విషయంలోనూ అదే జరిగింది.
కన్నడ చిత్రపరిశ్రమపై మీ అభిప్రాయం ఏమిటి?
శేష్: కన్నడంలో నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నా. చెప్పగలననే ధైర్యం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పని చేస్తా. కొత్త సినిమాలతో కన్నడ వాళ్లు రికార్డులు క్రియేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇప్పటివరకూ ఆరు హిట్స్ ఇచ్చారు కదా? తదుపరి చిత్రాన్ని టాప్ దర్శకులతో చేస్తారా?
శేష్: పెద్దా, చిన్నా, దక్షిణాది, ఉత్తరాది అనేది కాదు. కథ బాగుంటే చాలు. అలాగే దర్శకుడు కూడా నాకు నచ్చిన వ్యక్తి అయితే చాలు.
కూకట్‌పల్లి వర్సెస్ అమీర్‌పేట్.. దీనికి సమాధానం చెప్పండి?
శేష్: కూకట్‌పల్లిలో సినిమా చూసి.. అమీర్‌పేట్‌కు వెళ్లి షాపింగ్ చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు