Adivi Sesh: తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పు అది: అడివి శేష్
‘హిట్-2’ ప్రమోషనల్ పనుల్లో బిజీగా ఉన్నారు నటుడు అడివి శేష్. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్‌లో ఆయన తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
హైదరాబాద్: ‘మేజర్’తో (Major) ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం ‘హిట్-2’ (HIT 2) రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌పై ఆసక్తికర విశేషాలు బయటపెట్టారు.
మూడు రోజులకే ప్యాకప్
‘‘సొంతం’ సినిమా విషయంలో నేను మోసపోయా. ఆ సినిమా అప్పుడు నా వయసు 15 ఏళ్లు. గడ్డం కూడా లేదు. అమ్మ వాడే కాటుకను గడ్డంలా పెట్టుకొని బిల్డప్ కొట్టేవాడిని. అలాంటి సమయంలో, ఆ సినిమా ఆఫర్ వచ్చింది. ‘దిల్ చాహతా హై’ ప్రీమేక్ చేస్తున్నాం. ఇందులో నలుగురు హీరోలు ఉంటారని చెప్పారు. వాళ్లు చెప్పిన మాటకు ఓకే అన్నాను. తీరా చూస్తే మూడు రోజుల తర్వాత ప్యాకప్ చెప్పి.. వెళ్లిపొమ్మన్నారు. తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు అది. ఆ తర్వాత పదేళ్ల పాటు అమెరికాలో చదువుకుని మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చా’’
ఆమె ట్వీట్ వల్ల నేనెంతో బాధపడ్డా
‘‘రిచా పెట్టిన ట్వీట్ వైరల్‌గా మారిన సమయంలో ఓ విలేకరి నాకు ఫోన్ చేశాడు. బాలీవుడ్ నటి పెట్టిన ట్వీట్‌పై మీ అభిప్రాయమేమిటి? అని అడిగాడు. వెంటనే ఆమె పెట్టిన ట్వీట్ చూశా. ఆమె ఉద్దేశం ఏమిటి అనేది తెలియదు కానీ, ‘మేజర్’ సినిమా వల్ల సైనికుల కష్టాలను దగ్గర నుంచి చూసిన వాడిగా ఆ ట్వీట్ నన్నెంతో బాధపెట్టింది’’
నానిని అడిగితే.. నవ్వాడు
‘‘ప్రస్తుతం నేను కెరీర్, పర్సనల్ లైఫ్ అనే వ్యత్యాసం లేకుండా పనిచేస్తున్నా. ఆ బ్యాలెన్స్ తెలిసినప్పుడు పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నా ఫోకస్ అంతా సినిమాపైనే ఉంది. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారనే విషయంపై ఇటీవల నానిని అడగ్గా.. ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు’’ అని శేష్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
-
World News
Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!’
-
General News
TSSPDCL Jobs: గుడ్‌న్యూస్.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 ఉద్యోగాలకు ప్రకటన
-
Movies News
Yash: యశ్ ఇంటి వద్ద బారులు తీరిన అభిమానులు.. వీడియోలు వైరల్