Adivi Sesh: మార్నింగ్ మహేశ్ కాల్ చేశారు.. ఆయన మాటలతో కన్నీళ్లు వచ్చేశాయి!
మహేశ్‌బాబుతో ఈరోజు ఉదయం ఫోన్‌లో మాట్లాడానని అన్నారు నటుడు అడివి శేష్. మహేశ్ మాటలకు తనకు కన్నీళ్లు వచ్చేశాయని చెప్పారు.
హైదరాబాద్: ‘హిట్-2’ (HIT 2) విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నటుడు అడివి శేష్ (Adivi Sesh). ఇందులో కేడీ అనే పోలీస్ అధికారిగా శేష్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అతడు తాజాగా నెటిజన్లతో ట్విటర్ చాట్ చేశాడు.
‘హిట్-2’ విజయాన్ని నిన్న రాత్రి మీరెలా ఎంజాయ్ చేశారు?
శేష్: నేను, నాని, విశ్వక్‌సేన్, శైలేష్ కొలను కలిసి ‘హిట్’ వర్స్‌కు సంబంధించిన తదుపరి కార్యాచరణ గురించి చర్చించుకున్నాం. అలాగే, ఇతర చిత్రబృందంతో కలిసి డ్యాన్స్ చేశాం. మా డ్యాన్స్ చూసి మీనాక్షి నవ్వింది.
‘హిట్-2’ హిందీ వెర్షన్‌కు మీరే డబ్బింగ్ చెబుతున్నారా?
శేష్: నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతా. త్వరలోనే హిందీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం.
‘హిట్’వర్స్‌లో మహేశ్‌బాబుని హీరోగా పెట్టండి.. సినిమా మరోస్థాయికి వెళ్తుంది. ఆయనతో మీరొక థ్రిల్లింగ్ స్టోరీ చేస్తే చూడాలని ఉంది..?
శేష్: ఇది ఆయనకు సూట్ అవుతుందో లేదో ఆలోచించాలి. ఈరోజు ఉదయం ఆయన ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడారు. నా విషయంలో గర్వంగా ఉన్నానని చెప్పారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఒక సోదరుడిగా ఎప్పటికీ తోడుగా ఉంటానని ఆయనకు మాటిచ్చా. అలాగే, ఆయనకు ‘హిట్-2’ చూపించాలని ఆశగా ఎదురుచూస్తున్నా.
‘గూఢచారి-2’ ఎప్పుడు?
శేష్: ప్రస్తుతం ‘హిట్-2’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా. త్వరలో హిందీ వెర్షన్ ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. ఆ తర్వాతనే ‘గూఢచారి-2’.
‘హిట్’వర్స్ భవిష్యత్తులో ఎలా ఉండనుందని భావిస్తున్నారు?
శేష్: ఇదొక నేషనల్ ఫ్రాంచైజీ అవుతుందనుకుంటున్నా. హైదరాబాద్‌లో మొదలైన ఈసినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని భావిస్తున్నా.
మీ కెరీర్‌లో మీకు బాగా నచ్చిన చిత్రం?
శేష్: నా హృదయానికి బాగా చేరువైన చిత్రం ‘మేజర్’. కానీ, హిట్-2 నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.
హిట్ వర్స్ కేవలం తెలుగు హీరోలకే పరిమితం చేస్తారా? లేదా వేరే ఇండస్ట్రీ వాళ్లను కూడా ఇందులో చూపిస్తారా?
శేష్: నాకు కూడా తెలియదు. కానీ, మన తెలుగు హీరోలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎంతో మంది అభిమానాన్ని పొందుతున్నారు. అలాంటప్పుడు సమస్య ఏముంది?
చిన్నప్పుడు మీరు చూసిన ఏ సినిమా మీలో స్ఫూర్తి నింపింది?
శేష్: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బాషా.
మనం ఎప్పుడు డేట్‌కు వెళ్దాం?
శేష్: ఇదిగో వచ్చేస్తున్నా. ‘హిట్-2’ చూడాలనుకుంటున్నావా.
మీరు అభిమానించే తెలుగు హీరో ఎవరు?
శేష్: నేనే
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఖగోళంలో వింత... చంద్రుడితో శుక్ర గ్రహణం
-
India News
Rahul Gandhi : రాహుల్‌పై వేటు నిలబడుతుందా..
-
Ap-top-news News
Vande Bharat Express : తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’