Major: మేజర్‌ సందీప్‌ గౌరవం పెంచే చిత్రమిది

‘‘వాడికి మంచి కొడుకుగా ఉండటం కంటే... మంచి భర్తగా ఉండటం కంటే...మంచి సోల్జర్‌గా ఉండటం అవసరం’’ అంటూ ప్రకాష్‌రాజ్‌ మాటలతో విడుదలైన ‘మేజర్‌’ చిత్ర ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

Updated : 10 May 2022 12:21 IST

‘‘వాడికి మంచి కొడుకుగా ఉండటం కంటే... మంచి భర్తగా ఉండటం కంటే...మంచి సోల్జర్‌గా ఉండటం అవసరం’’ అంటూ ప్రకాష్‌రాజ్‌ మాటలతో విడుదలైన ‘మేజర్‌’ చిత్ర ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అడివి శేష్‌ కథానాయకుడిగా నటించిన ‘మేజర్‌’కి శశికిరణ్‌ తిక్క దర్శకుడు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ప్రకాష్‌రాజ్‌, రేవతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్‌ ఎస్‌, సోనీ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూశా. చివరి అరగంట బాగా ఎమోషనల్‌ అయ్యాను. రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. తర్వాత అడివి శేష్‌ను గట్టిగా హత్తుకున్నాను’ అన్నారు. అడివి శేష్‌ మాట్లాడుతూ... ‘‘మేజర్‌ సందీప్‌ గౌరవం పెంచేలా ఈ చిత్రముంటుంది. ఆయన తల్లిదండ్రులతో ఏడుసార్లు కూర్చొని మాట్లాడి కథ తయారు చేసుకున్నాం. అన్ని కోణాల్లో ఆయన జీవితం ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ఈ ప్రయాణంలో మాకు వెన్నెముకలా నిలిచారు మహేష్‌బాబు’ అన్నారు. దర్శకుడు శశికిరణ్‌ మాట్లాడుతూ ‘‘అడివి శేష్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. అతను ఎప్పటికీ మాకు స్ఫూర్తే’’ అన్నారు. కార్యక్రమంలో నిర్మాతలు అనురాగ్‌, శరత్‌, అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని