
MAJOR: అడవి శేష్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ విడుదల వాయిదా
హైదరాబాద్: అడివి శేష్(Adivi Sesh) కథానాయకుడిగా శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ‘మేజర్’(Major) విడుదల వాయిదా పడింది. ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం కరోనా మూడోదశ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. దీంతో పలు సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. అదే బాటలో ‘మేజర్’ కూడా పయనించింది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. అప్పటివరకూ ప్రజలందరూ కొవిడ్ నిబంధలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరింది.
‘మేజర్’ కోసం యూనిట్ ఎంతో కష్టపడింది. ఈ సినిమా కోసం ఎనిమిది ప్రత్యేక సెట్లు వేసి, 75లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. 120రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ కథా నాయికలుగా నటిస్తున్న ‘మేజర్’లో ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.