Adivi Sesh: ముంబయిలో ‘మేజర్‌’

‘మేజర్‌’తో హిందీలోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు కథానాయకుడు అడివి శేష్‌. 26/11 ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్‌ తిక్కా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Updated : 28 Nov 2022 06:55 IST

‘మేజర్‌’తో (Major) హిందీలోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు కథానాయకుడు అడివి శేష్‌ (Adivi Sesh). 26/11 ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్‌ తిక్కా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబయి దాడులు జరిగి నిన్నటితో సరిగ్గా పధ్నాలుగేళ్లు. ఈ సందర్భంగా మేజర్‌ సందీప్‌ పాత్ర పోషించిన అడివి శేష్‌ ఆదివారం ముంబయి వెళ్లి అమరవీరులకు నివాళి అర్పించారు. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ తల్లిదండ్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ‘ఈ ధీశాలులను కలుసుకోవడం, నివాళి అర్పించడం, ఆ వీరుల్ని కన్నవాళ్లని గౌరవించడం.. ఎన్నిసార్లు చేసినా.. ప్రతిసారీ నాకు గర్వంగానే ఉంటుంది. వాళ్ల త్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. వాళ్ల తల్లిదండ్రుల త్యాగం సైతం వెలకట్టలేనిది. సందీప్‌ పేరెంట్స్‌ని నా సొంత తల్లిదండ్రుల్లా భావిస్తుంటా. వాళ్లూ నన్ను కొడుకులాగే చూస్తారు’ అని ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు అడివి శేష్‌. శేష్‌ నటించిన క్రైం డ్రామా ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ డిసెంబరు 2న విడుదలవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని