Adivi Sesh: నానిని విలన్‌ చేసిన నెటిజన్‌.. శేష్‌ రియాక్షన్‌ ఇది!

అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హిట్‌ 2’. శైలేష్‌ కొలను దర్శకుడు. డిసెంబరు 2న విడుదలకానుంది.

Published : 29 Nov 2022 22:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సినిమాలకు సంబంధించి ఏదైనా విషయం తెలిస్తే చాలు కొందరు ఉత్సాహం చూపుతుంటారు. అది నిజమో కాదో చెక్‌ చేసుకోకుండా ఇతరులతో పంచుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. తాజాగా ఓ నెటిజన్‌ అలానే చేశాడు. ‘హిట్ 2లో నాని విలన్‌. అధికారికంగా ఖరారైంది’ అని ట్వీట్‌ చేస్తూ సంబంధిత హ్యాష్‌ట్యాగ్స్‌ జత చేశాడు. అది ఆ సినిమా హీరో అడివి శేష్‌ (Adivi Sesh)కు చేరింది. దానిపై ఆయన స్పందిస్తూ.. ‘ఇది ఎప్పుడు అయింది’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీన్ని చూసిన పలువురు సినీ ప్రియులు ఈ సినిమా విషయంలో తమకున్న సందేహాలను కామెంట్ల రూపంలో శేష్‌ను అడుగుతున్నారు.

ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో నాని (Nani) పేరు తెరపైకి వచ్చింది. విశ్వక్‌ సేన్ హీరోగా 2020లో వచ్చిన ‘హిట్‌’కు కొనసాగింపుగా హిట్‌ 2 (Hit 2) రూపొందింది. ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో సాగే ఈ రెండు ప్రాజెక్టులను దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సీక్వెల్‌ డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని