Adivi Sesh: యూట్యూబ్‌లో కనిపించని ‘హిట్‌ -2’ టీజర్‌.. స్పందించిన అడివి శేష్‌

‘హిట్-2’ టీజర్‌పై యూట్యూబ్‌ పరిమితులు విధించడం గురించి స్పందించారు నటుడు అడివి శేష్‌.

Published : 09 Nov 2022 16:25 IST

హైదరాబాద్‌: అడివి శేష్‌ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ -2’ (HIT 2). శైలేశ్‌ కొలను దర్శకుడు. క్రైమ్‌ సీన్స్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌పై యూట్యూబ్‌ పరిమితులు విధించింది. దీనిపై అడివి శేష్‌ స్పందించారు. ‘‘శైలేశ్‌ కొలను సినిమా టీజర్‌ చూపించినప్పుడే ఇలాంటి ఓ రోజు వస్తుందని అనుకున్నా. అనుకున్నట్టుగానే వచ్చింది. ట్రెండింగ్‌ లిస్ట్‌ నుంచి మా సినిమా టీజర్‌ను యూట్యూబ్‌ తొలగించింది. టీజర్‌ విడుదలైన తర్వాత వరుసగా నాలుగు రోజులపాటు మా వీడియో యూట్యూబ్ ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో ఉంది. సడెన్‌గా దీన్ని తొలగించేసి.. కేవలం 18 ఏళ్లు నిండినవాళ్లు మాత్రమే చూసేలా పరిమితులు విధించారు. కాబట్టి ఇప్పుడు మీరు మా టీజర్‌ చూడాలనుకుంటే సైన్‌ ఇన్‌ చేసి.. 18 ఏళ్లు నిండినవాళ్లు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఏడు విభిన్నమైన క్రైమ్ కథలతో ‘హిట్‌’ యూనివర్స్‌ని సృష్టించాలనుకున్నారు దర్శకుడు శైలేశ్‌ కొలను. ఇందులో భాగంగా 2020లో ఆయన ‘హిట్‌’ని తెరకెక్కించారు. దానికి కొనసాగింపుగా మరో క్రైమ్‌ కథతో ‘హిట్‌-2’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. అడివి శేష్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. వైజాగ్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ యువతి హత్యను ప్రధానంగా చూపించనున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. వీడియో చివర్లో చూపించిన క్రైమ్‌ సీన్‌ సినీ ప్రియుల్ని భయానికి గురి చేసింది. ఆ సీన్‌లో క్రైమ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా దీన్ని తొలగించారు. దీంతో ‘హిట్‌-2’ టీజర్‌ కోసం యూట్యూబ్‌లో సెర్చ్‌ చేస్తే This Video May Inappropriate To Some Users అని వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని