Adiyae Ott Release: ‘అడియే’ ఓటీటీ రిలీజ్‌.. చెప్పిన టైమ్‌ కంటే ముందే మొదలైన స్ట్రీమింగ్‌

జీవీ ప్రకాశ్‌ నటించిన ‘అడియే’ (Adiyae) చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. నేటి సాయంత్రం నుంచే స్ట్రీమింగ్‌ మొదలైంది.

Published : 28 Sep 2023 19:00 IST

చెన్నై: ‘బ్యాచ్‌లర్‌’తో హీరోగా పేరు తెచ్చుకున్నారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ (GV Prakash). ఆయన హీరోగా నటించిన సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అడియే’ (Adiyae). గౌరీ జి.కిషన్‌ కథానాయిక. సైంటిఫిక్‌ రొమాంటిక్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేశ్‌ కార్తిక్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం యువత నుంచి ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 29న సోనీలివ్ వేదికగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు ముహూర్తం ఖరారైంది. కాకపోతే, సినీ ప్రియుల నుంచి వస్తోన్న అభ్యర్ధను దృష్టిలో ఉంచుకుని సదరు ఓటీటీ సంస్థ నేటి సాయంత్రం నుంచే ‘అడియే’ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ముందు అనుకున్న దానికంటే ముందే ‘అడియే’ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తమిళంతోపాటు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది ప్రస్తుతం ప్రసారం అవుతోంది.

Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2

కథేంటంటే: జీవా (జీవీ ప్రకాశ్‌) స్కూల్‌లో చదువుతున్న రోజుల్లోనే సెంథాళినితో ప్రేమలో పడతాడు. ఏళ్లు గడుస్తున్నా తన ప్రేమను మాత్రం ఆమెతో చెప్పడు. ఈ క్రమంలోనే ఆమె ఓ ఫేమస్‌ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంది. తన ప్రేమను ఆమెకు ఎలా అయినా చెప్పాలని జీవా కలలు కంటుంటాడు.  అనుకోని విధంగా అతడు ఓసారి మరో ప్రపంచంలోకి వెళ్తాడు. అక్కడ జీవా కూడా గాయకుడిగా మంచి పేరు తెచ్చుకుని, సెంథాళినిని వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతడు మరో ప్రపంచం నుంచి వాస్తవంలోకి అడుగుపెడతాడు. సెంథాళిని ప్రేమను పొందాలని, ఆమెతో జీవితాన్ని కొనసాగించాలని ఆశించిన జీవా ఏం చేశాడు? తిరిగి మరో ప్రపంచంలోకి వెళ్లాడా? లేదా వాస్తవ ప్రపంచంలోనే ఆమె ప్రేమను గెలుచుకున్నాడా? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని