
Dhanush: రెండు బాలీవుడ్ చిత్రాల్లో!
ధనుష్ దక్షిణాదిలోనే కాదు హిందీ ప్రేక్షకులనూ అలరిస్తున్నారు. ఈ మధ్య విడుదలైన హిందీ చిత్రం ‘అత్రంగీ రే’ చిత్రంతో ధనుష్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సారా అలీఖాన్, అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ధనుష్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట ఆనంద్ ఎల్ రాయ్. ‘‘ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్లది మంచి కాంబినేషన్. మళ్లీ ఈ కలయికలో సినిమా రానుంది. ప్రేమ కథా చిత్రమిది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాణ సంస్థ కలర్ ఎల్లో నిర్మించనుంది’’అని రాయ్ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. దీంతో పాటు మరో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధనుష్‌తో సినిమా చేయనుందని తెలుస్తోంది. ‘అత్రంగీ రే’ విజయం తర్వాత ధనుష్‌తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శకనిర్మాతలు బాగా ఉత్సాహంగా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.