Agent: వేసవి బరిలో ఏజెంట్‌

అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఏజెంట్‌’. అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated : 02 Jan 2023 06:54 IST

అఖిల్‌ (Akhil) కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. కానీ, ఇప్పుడీ చిత్రాన్ని వేసవికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం ఈ చిత్ర మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. అందులో ఏజెంట్‌గా అఖిల్‌ సాహసాల్ని.. ఆయన చేసిన యాక్షన్‌ హంగామాను చూపించారు. ఇటీవలే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి హిప్‌ హాప్‌ తమిళ స్వరాలందిస్తున్నారు. రసూల్‌ ఎల్లోర్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని