అఖిల్‌ ‘ఏజెంట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. కమల్‌ ‘విక్రమ్‌’ చెప్పేది అప్పుడే!

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న

Published : 12 Mar 2022 01:32 IST

హైదరాబాద్‌: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 12న ఏజెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా గన్ తో అఖిల్ యాక్షన్ సీన్ లో ఉన్న పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది. ఏజెంట్ పోస్టర్ తో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.


మరోవైపు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ క్రమంలో ‘విక్రమ్‌’విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మార్చి 14న ఉదయం 7గంటలకు ఈ విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని