Agent: అఖిల్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. హాలీవుడ్‌ రేంజ్‌లో ‘ఏజెంట్‌’ టీజర్‌

అఖిల్‌ అక్కినేని  కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Published : 15 Jul 2022 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఖిల్‌ అక్కినేని (Akhil) కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ నటులు కిచ్చా సుదీప్‌, శివకార్తికేయన్‌లతో టీజర్‌ను విడుదల చేయించింది. వినూత్నమైన స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌లో చూపించిన యాక్షన్‌ ఘట్టాలను చూస్తే తెలుస్తోంది. అఖిల్‌ ఆహార్యం, పలికిన సంభాషణలు ఆయన అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని