Aha Na Pellanta: ఆసక్తిగా ‘అహ నా పెళ్లంట’ టీజర్‌.. రాజ్‌తరుణ్‌, శివానీ కాంబో

‘అహ నా పెళ్లంట!’ టీజర్‌ నవ్వులు పంచుతోంది. రాజ్‌తరుణ్‌, శివానీ జంటగా నటించిన సిరీస్‌ ఇది.

Published : 31 Oct 2022 17:32 IST

హైదరాబాద్‌: ‘ఇప్పటి నుంచి నా పెళ్లి అయ్యేంత వరకూ నేనే అమ్మాయి వెంట పడను’ అని ఓ బాలుడు తన తల్లికి ప్రమాణం చేస్తాడు. కట్‌ చేస్తే, పెరిగి పెద్దయ్యాక ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మరి, ఆ యువకుడు తన తల్లి చూపించిన అమ్మాయిని వివాహమాడాడా, ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేశాడా? తెలియాలంటే ‘అహ నా పెళ్లంట!’ (Aha Na Pellanta) చూడాల్సిందే. రాజ్‌తరుణ్‌ ( Raj Tharun), శివానీ రాజశేఖర్‌ (Shivaani Rajashekhar) జంటగా నటించిన వెబ్‌ సిరీస్‌ ఇది. సోమవారం టీజర్‌ విడుదలైంది. తన బాల్యంలో రాజ్‌తరుణ్‌.. అమ్మ (ఆమని)కు మాటిచ్చే సన్నివేశంతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ రూపొందినట్టు అర్థమవుతోంది. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నవంబరు 17న ఓటీటీ ‘జీ 5’లో విడుదలకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని