Chandrababu - Balakrishna: ‘అన్‌స్టాపబుల్‌ 2’ స్పెషల్‌ ఎపిసోడ్‌ అన్‌సెన్సార్డ్‌ వెర్షన్‌ రెడీ!

‘అన్‌స్టాపబుల్‌ 2’ మొదటి ఎపిసోడ్‌లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ వచ్చి నందమూరి బాలకృష్ణతో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి అన్‌సెన్సార్డ్‌ వెర్షన్‌ను రిలీజ్‌ చేయనున్నారు. 

Published : 28 Oct 2022 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోగానే కాదు... ఓటీటీలో హోస్ట్‌గానూ అదరగొడుతున్నాడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable) అంటూ ఆయన ప్రారంభించిన టాక్‌ షో మొదటి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు దానికి సెకండ్‌ సీజన్‌ (అన్‌స్టాపబుల్‌ 2) మొదలుపెట్టారు. ఈ షో మొదటి ఎపిసోడ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌  (Lokesh) వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మొదటి ఎపిసోడ్‌కి స్పెషల్‌ వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తారట. 

‘‘అనివార్య కారణాల వల్ల ‘అన్‌స్టాపబుల్‌ 2’ మూడో ఎపిసోడ్‌ ఆలస్యమవుతోంది. దీంతో ప్రేక్షకులకు డబుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పంచాలని నిర్ణయించుకున్నాం. మొదటి ఎపిసోడ్‌ (చంద్రబాబు ఎపిసోడ్‌) అన్‌సెన్సార్డ్‌ వెర్షన్‌ను టెలికాస్ట్‌ చేయనున్నాం’’ అని ఓటీటీ టీమ్‌ తెలిపింది. ‘‘మరింత ఆహ్లాదం, మరిన్ని రహస్యాలు.. సెన్సార్‌ చేయని ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ను గురువారం అర్ధరాత్రి 12 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) మీ ముందుకు తీసుకొస్తాం. త్వరలోనే మూడో ఎపిసోడ్‌ వస్తుంది’’ అని ట్వీట్‌ చేసింది. మరి ఈ అన్‌కట్‌ ఎపిసోడ్‌లో ఎలాంటి ఆసక్తికర విషయాలు ఉంటాయో చూడాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని