Aishwarya Lekshmi: ఈ సినిమా చేయనని చెప్పా: ఐశ్వర్య లక్ష్మి

‘‘మట్టి కుస్తీ’ ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ(నవ్వుతూ) ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ మూవీకి కనెక్ట్ అవుతారు’’ అంటున్నారు నటి ఐశ్వర్య లక్ష్మి. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు..

Published : 02 Dec 2022 01:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మట్టికుస్తీ’లో తాను చేసిన పాత్ర ఎంతో సవాల్‌తో కూడుకున్నదని, ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని నటి ఐశ్వర్య లక్ష్మి అన్నారు. విష్ణు విశాల్‌ కథానాయకుడిగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రమిది. రవితేజ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య లక్ష్మి పంచుకున్న విశేషాలు..

ఈ పాత్రకు న్యాయం చేయలేననిపించింది!

‘‘మూడేళ్ల క్రితం కొవిడ్‌కు ముందే ‘మట్టి కుస్తీ’ కథ విన్నా. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్‌తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ల తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్‌లో కొన్ని సినిమాలు చేయడంతో నమ్మకం కలిగింది. ఈ పాత్ర ఫిజికల్ వర్క్‌ని డిమాండ్ చేస్తుంది. దానికి తగిన విధంగా సిద్ధం కావాలి. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. ప్రేక్షకులు ఈ పాత్రను ఎలా తీసుకుంటారో తెలీదు’’

ఇది భార్యభర్తల కుస్తీ!

‘‘మట్టి కుస్తీ’ ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ(నవ్వుతూ) ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం ఉన్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసా వసూల్ మూవీ. ఇక విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ఆయన కథల ఎంపికలో మంచి అభిరుచి ఉంది. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం. నిర్మాత రవితేజ మంచి వ్యక్తి. ప్రీరిలీజ్‌ సమయంలో ఆయన్ను కలిశా’’

గొప్పగా ప్రేమిస్తారు!

‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీగా ఎదిగింది. ఒక విధంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుంచి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్‌కూ గొప్ప ఆదరణ వస్తోంది. తెలుగు ప్రేక్షకులకు సినిమా పట్ల ఉన్న అభిమానం, ప్రేమే దీనికి కారణం. సినిమాల ఎంపికలో నాకు ఎలాంటి తొందరలేదు. మంచి కథ, గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలనేది నా ప్రయత్నం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని