Boomika: పీల్చే గాలిని కూడా డబ్బులిచ్చి కొనే పరిస్థితి వస్తుంది!

‘ఈ క్యాంపస్‌లో దెయ్యం ఉంది. తెలుసుకున్నామా?’ అంటూ ప్రశ్నిస్తోంది ఐశ్వర్య రాజేశ్‌. ఆమె కీలక పాత్రలో

Updated : 22 Aug 2022 16:11 IST

హైదరాబాద్‌: ‘ఈ క్యాంపస్‌లో దెయ్యం ఉంది. తెలుసుకున్నామా?’ అంటూ ప్రశ్నిస్తోంది ఐశ్వర్య రాజేశ్‌. ఆమె కీలక పాత్రలో రతీంద్రన్‌ ఆర్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూమిక’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మట్టి, గాలి, నీరు, ఇవన్నీ ఎవరికీ సొంతం కాదండీ. వీటి మీద పెత్తనం చెలాయించే వారే, ఈ పిచ్చి పట్టిన మనుషులు’ అంటూ వినిపిస్తున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ‘భూమిక’ కథేంటి? దెయ్యాలు ఉన్నాయా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఆగస్టు 23న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. పృథ్వీ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు సమర్పిస్తున్నారు. కార్తికేయన్‌ సంతానం, సుధాన్‌ సుందరం, జయరామన్‌ నిర్మిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని